Kitchenvantalu

Wheat Flour Gulab Jamun:గోధుమ పిండితో గులాబ్ జామున్.. తిన్న వాళ్ళకి మీరు చెప్తే గాని తెలియదు

Wheat Flour Gulab Jamun:గోధుమ పిండి గులాబ్ జామున్స్.. గులాబ్ జామున్ అంటే అందరు ఇష్టంగా తింటుంటారు. ఇంట్లో ఉన్న గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే గులాబ్ జామూన్స్ చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 1 కప్పు
బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్స్
చక్కెర – 1 కప్పు
యాలకుల పొడి – కొద్దిగా
వంట సోడా – కొద్దిగా
నెయ్యి – తగినంత

తయారీ విధానం
1.ప్యాన్ నెయ్యి వేడి చేసి గోధుమ పిండి,బొంబాయి రవ్వవేసి దోరగా వేపుకోవాలి.
2.వేపుకున్న పిండిని వేరొక ప్లేట్ లోకి ట్రాన్సఫర్ చేసుకోవాలి.
3.వేపుకున్న పిండిలో యాలకకుల పొడి ,వంట సోడా కరిగించిన నెయ్యి వేసి కొద్ది కొద్దిగా పాలు వేస్తూ మిక్స్ చేసుకోవాలి.
4.పిండిని మెత్తగా కలుపుకోని పది ,పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి.
5.ఇప్పుడు చక్కెర సిరప్ కోసం కప్పు నీళ్లు ,కప్పు చక్కెర వేసి మిక్స్ చేసి మరిగించాలి.

6.సిరప్ మరుగుతున్నప్పుడు యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
7.ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని జామూన్స్ తయారు చేసుకోవాలి.
8.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నూనె ,లేదా నెయ్యి వేసి వేడి చేయాలి.
9.తయారు చేసుకున్న జామూన్స్ ని నూనెలో వేసుకోని బ్రౌన్ కలర్ లోకి మారేంత వరకు వేపుకోవాలి.
10.వేపుకున్న జామూన్స్ ని వేడిగా ఉన్నప్పుడే చక్కెర సిరప్ లో వేసుకోవాలి.
11.రెండు గంటల పాటు సిరప్ లో జామూన్స్ నానాక సర్వ్ చేసుకోవడమే.