Kitchenvantalu

Matar Paratha Recipe:పచ్చి బఠాణీతో పరాటా.. పిల్లలకు నచ్చే బ్రేక్‌ఫాస్ట్..

Matar paratha Recipe:మటర్ పరాఠా.. టిఫిన్స్ లోకి అయినా, లంచ్ బాక్స్ లోకి అయినా, పరాఠా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా, పచ్చి బఠానీలతో మటర్ పరాఠా ట్రై చేయండి.

కావాల్సిన పదార్థాలు
పచ్చి బఠానీలు – 1 కప్పు
గోధుమపిండి – 2 కప్పులు
అజోవాన్ – 1/4టేబుల్ స్పూన్
పసుపు- 1/2టేబుల్ స్పూన్
బటర్ – 1 కప్పు
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం
1.ముందుగా గోధుమ పిండిలోక, ఉప్పు, కొద్దిగా పసుపు, అజోవాన్, వేసి, తగినన్ని నీళ్లను వేస్తూ, పిండిని కలుపుకోవాలి.
2.చపాతి పిండిలా, సాఫ్ట్ గా కలుపుకుని, పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని, ఆయిల్ వేడి చేసి, అందులోకి, పచ్చి మిర్చి వెల్లుల్లి రెబ్బలు, మెంతి ఆకులు, కరివేపాకు,పూదీనా ఆకులు, వేసి, కాస్త వేగిన తర్వాత పచ్చి బఠానీలను యాడ్ చేసుకోవాలి.
4. అవసరం అనుకుంటే, కొద్దిగా వాటర్ వేసుకుని, బఠానీలను ఫ్రై చేసుకోవాలి.
5. బఠానీ ఉడికింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుని, బఠానీలను చల్లారనివ్వాలి.
6. చల్లారిన బఠానీలను మిక్సీ జార్ లో వేసి, అందులోకి జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కొత్తిమీర ఆకులు, వేసుకుని, కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి.

7. ఇప్పుడు బఠానీ స్టప్ రెడీ అయినట్లే.
8.ఒక వేళ స్టఫ్ జారుగా కాని, అనిపిస్తే, ప్యాన్ లో వేసి, ఆయిల్ వేడి చేసి, రెండు మూడు నిముషాలు వేపుకోవాలి.
9. అందులోకి ఆమ్ చూర్ పొడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. స్టఫ్పింగ్ కు సిద్దం చేసుకోవచ్చు.
10. ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కొద్దిగా కొద్దిగా తీసుకుని, పూరీలా, వత్తుకోవాలి.
11.అందులోకి రెడీ చేసుకున్న స్టఫ్ ను మధ్యలో పెట్టి, పూరిని క్లోజ్ చేయాలి.
12. ఎక్స్ ట్రా పిండిని తీసేసి, పిండి ముద్దను, నెమ్మదిగా కాల్చుకోవాలి.
13. ఇప్పుడు పరాఠాలు కాల్చడం కోసం, స్టవ్ పై పాన్ పెట్టుకుని, కడిగిన బటర్ వేసి, దాని పై తయారు చేసుకున్న పరాఠాలు వేసుకోవాలి.
14. లో ఫ్లేమ్ పై , రెండు వైపులా , నెయ్యి వేస్తూ, దోరగా కాల్చుకోవాలి.
15.అంతే మటర్ పరాఠా రెడీ.