Healthhealth tips in telugu

Red Banana Benefits: ఈ ఎరుపు రంగు అరటి పండు తింటే.. కిడ్నీ సమస్యలకు చెక్..

Red Banana Benefits: ఒకప్పుడు ఎర్ర అరటి పండ్లు అరుదుగా లభించేవి. ప్రస్తుతం ఈ పండ్లు చాలా విరివిగా లభిస్తున్నాయి. వీటిని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. వీటి గురించి మనలో చాలా మందికి తెలియదు.

నేటి జీవన విధానంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిని తగ్గించుకోవటానికి మందుల జోలికి వెళ్లకుండా కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ మాత్రమే ఇంటి చిట్కాలను ఫాలో అవ్వాలి. అదే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సలహా పాటిస్తూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఫలితం చాలా త్వరగా వస్తుంది.

కిడ్నీ సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. మారిన జీవనశైలి,నీరు చాలా తక్కువగా తాగటం, మ‌ద్యం అల‌వాటు వంటి కారణాలతో కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. రాళ్ళు చిన్నగా ఉంటే వాటంత‌ట అవే యూరిన్ ద్వారా బ‌య‌ట‌కు పోతాయి.కానీ, పెద్ద‌గా ఉంటే మాత్రం.ఆ రాళ్లు యురేటర్‌లో చిక్కుకుని తీవ్ర నొప్పిని క‌లిగిస్తాయి.అదే స‌మ‌యంలో యూరిన్ యొక్క ఫ్లోను అడ్డుకుంటాయి.

కిడ్నీలో రాళ్ళను అసలు అశ్రద్ద చేయకూడదు. కొన్ని ఆహారాలను తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి.ఎర్ర అరటిపండు చాలా బాగా పనిచేస్తుంది. మామూలు అరటిపండుతో పోలిస్తే ఎర్ర అర‌టి పండ్ల‌లో పొటాషియం అధికంగా ఉంటుంది.ఇది మూత్రపిండాల్లో రాళ్ల‌ను క‌రిగించ‌డంతో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఎర్ర అర‌టి పండ్ల‌లో చాలా త‌క్కువ మోతాదులో కేల‌రీలు ఉంటాయి.అందువల్ల బరువు తగ్గాలని అనుకొనే వారు కూడా ఎర్ర అరటిపండు తినవచ్చు. కాబట్టి మనకు ఆరోగ్యాన్ని అందించే పండ్లను తప్పనిసరిగా ఆహారంలో బాగంగా చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.