Corn Laddu Recipe:మృదువైన మొక్కజొన్న లడ్డు చేయాలంటే ఓసారి ఇలా కొత్తగా చేయండి
Corn Laddu Recipe: సత్తు ముద్దలు..పండుగల్లో స్పెషల్ గా చేసుకోని ప్రసాదంగా పెట్టుకునే మొక్క జొన్న పిండి ముద్దలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
మొక్క జొన్ననలు – 2 కప్పులు
బెల్లం – 1 కప్పు
యాలకుల పొడి – కొద్దిగా
నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని మొక్కజొన్న గింజలను మీడియం ఫ్లేమ్ పై దోరాగా వేపుకోవాలి.
2.వేపుకున్న మొక్కజొన్న గింజలను చల్లారినివ్వాలి.
3.చల్లారిన మొక్క జొన్నలను గ్రైండ్ చేసుకోవాలి.
4.ఇప్పుడు బెల్లం పాకం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి బెల్లం ½ కప్పు నీళ్లను వేసి కలుపుతు తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి.
5.ఇప్పుడు బెల్లం పాకంలోకి యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
6.అందులోకి కరిగిన 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి కలుపుకోవాలి.
7.నెయ్యి మిక్స్ అయ్యాక గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న పిండిని పాకంలో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోని కలుపుకోవాలి.
8.మిశ్రమం కాస్త గోరువెచ్చగా ఉండగానే లడ్డూలను చుట్టుకోవాలి.
9.బటర్ కాని నెయ్యి కాని అరచేతిలకు రాసుకోని లడ్డులను పగుల్లు లేకుండా చుట్టుకోవాలి.
10. అంతే కమ్మటి సత్తు పిండి ముద్దలు రెడీ.