Kitchenvantalu

Carrot Tomato Pachadi: క్యారెట్‌ల‌తో ప‌చ్చ‌డి కూడా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది.. త‌యారీ ఇలా..!

Carrot Tomato Pachadi:క్యారెట్ టమాటో పచ్చడి.. కంటికి మేలు చేసే క్యారెట్ తో పచ్చడి చేసేద్దాం. తియ్యని క్యారట్ కి పుల్లని టమాటోలు మిక్స్ చేసి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
క్యారేట్స్ – 3
టమాటోలు – 2
వెల్లుల్లి రెబ్బలు – 7-8
జీలకర్ర – 1 టీ స్పూన్
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 2
నువ్వులు – 1 ½ టేబుల్ స్పూన్
చింతపండు – 10 గ్రాములు
ఉప్పు – రుచికి సరిపడా
తాలింపులు – తగినన్ని

తయారీ విధానం
1.ముందుగా టమాటోలు ,క్యారేట్ తొక్క తీసుకోని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి ధనియాలు ,ఎండుమిర్చి,నువ్వులు,జీలకర్ర వేసి వేపుకోని ప్లేట్ లోకి తీసుకోవాలి.
3.అదే ప్యాన్ లో మరో టీ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి క్యారేట్ తురుము వేసి రెండు మూడు నిమిషాలు వేపుకోవాలి.
4. క్యారెట్ వేగాక అందులోకి టమాటో ముక్కలు వేసి మెత్తపడే వరకు మగ్గించుకోవాలి.
5.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోని మిశ్రమాన్ని చల్లరనివ్వాలి.

6.ఇప్పుడు మిక్సి జార్ లోకి వేపుకున్న పప్పు దినుసులను వేసి అందులోకి వెల్లుల్లి రెబ్బలు,పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
7.ఇప్పుడు అందులోకి క్యారెట్ ,టమాటో ముక్కలను వేసి చింతపండు గుజ్జును యాడ్ చేసి తగినంత ఉప్పును వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
8.ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ లో ఆయిల్ వేడి చేసి అందులోకి తాలింపు గింజలు,ఎండు మిర్చి,కరివేపాకు,పసుపు వేసి వేగిన తాలింపులో గ్రైండ్ చేసుకున్న క్యారెట్ ,టమాటో పేస్ట్ ని వేసి మిక్స్ చేసుకోవాలి.
9.అంతే క్యారట్,టమాటో చట్నీ రెడీ.