Kitchenvantalu

Vankaya Aloo Curry :ఆలూ వంకాయ కర్రీ రుచిగా రావాలంటే ఇలా చేయండి.. రైస్ లోకి టేస్ట్ అదిరిపోతోంది

Vankaya Aloo Curry :వంకాయ ఆలు కర్రీ.. రోజు చేసే కూరలైనా ఒకేలా కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తు ఉండాలి. అప్పుడే బోర్ కొట్టకుండా ఉంటుంది రుచిలో కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఆలు,వంకాయ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి ఈ సారీ.

కావాల్సిన పదార్ధాలు
వంకాయలు – 3
టమాటోలు – 3
ఉల్లిపాయలు – 1
పచ్చిమిర్చి – 2
కారం – 1 ½ స్పూన్
ఉప్పు – 1 స్పూన్
జీలకర్ర -1/2 టీస్పూన్
పసుపు – ½ టీ స్పూన్
అల్ల వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా కూరగాయలను శుభ్రంగా కడిగి తరిగి పక్కన పెట్టుకోవాలి.
2.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి ఆవాలు ,జీలకర్ర ,ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి.
3.ఉల్లిపాయలు వేగాక పచ్చిమిర్చి వేసి కాసేపు వేపుకోవాలి.
4.ఇప్పుడు అందులోకి పసుపు ,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి.
5.అల్లం వెల్లుల్లి వేగాక ఆలు ముక్కలను వేసి రెండు,మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.

6.ఇప్పుడు టమాటోలను యాడ్ చేసి మెత్తపడే వరకు ఉడికించుకోవాలి.
7.ఇప్పుడు వంకాయలను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోని మూడు ,నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి.
8.కూరగాయలు ఉడికాక అందులోకి కారం ,ఉప్పు,జీలకర్రర పొడి,ధనియాల పొడి వేసి కలుపుకోని ½ కప్పు నీళ్లు యాడ్ చేసి మూతపెట్టి గ్రేవీ చిక్క పడే వరకు ఉడికించాలి.
9.చివరగా కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకోని సర్వ్ చేసుకోవటమే..