Kitchenvantalu

Egg Dal Curry:బ్యాచిలర్స్ వంటరాని వారి స్పెషల్.. కోడి గుడ్దు పప్పుకూర..

Egg Dal Curry:ఎగ్ దాల్ కర్రీ.. ఏ కర్రీకి వంకలు పెట్టినా ఎగ్ కర్రీ అంటే మాత్రం నో చెప్పకుండా తినేస్తారు. ఎగ్ కర్రీని ఒకే విదంగా కాకుండా పప్పుతో మిక్సి చేసి ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
పెసరపప్పు – ½ కప్పు
గుడ్లు -4
స్ప్రింగ్ ఆనియన్స్ -2 కప్పులు
పచ్చిమిర్చి – 5-6
కరివేపకు – ½ కప్పు
వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
పసుపు – ½ టీస్పూన్
జీలకర్ర – 1 స్పూన్
ఉప్పు – 1 ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా పెసరపప్పును అరగంట పాటు నానబెట్టుకోవాలి.
2.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి జీలకర్ర,ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి.
3.ఉల్లిపాయలు వేగాక కరివేపాకు,పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోని నానబెట్టిన పెసర పప్పు యాడ్ చేసుకోవాలి.
4.మూతపెట్టుకోని పప్పును కాసే పు ఉడకనివ్వాలి.

5.ఇప్పుడు అందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి.
6.ఇప్పుడు అందులోకి ఉప్పు వేసి పావు కప్పు నీళ్లను కలిపి కొత్తిమీరవేసి బాగా ఉడుకుపట్టనివ్వాలి.
7.కూర ఉడుకుతున్న టైంలో మద్యలో ప్లేస్ చేసుకోని అందులోకి గుడ్లను కొట్టి పోసుకోవాలి.
8.గుడ్లను వెంటనే కదిలించ కుండా మూతపెట్టి కాసేపు ఉడకనివ్వాలి.
9.గుడ్డు కాస్త గట్టి పడ్డాక మూత తీసి కూర అంతటిని బాగా మిక్స్ చేసుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ దాల్ కర్రీ రెడీ.