Eye Care:రోజూ కళ్లుకి కాటుక పెడుతున్నారా.. ఒక్క నిమిషం.. ఇది ఒకసారి చదవండి!
Eye Care:కళ్ళకు కాటుక పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయో మాటల్లో చెప్పలేము. కళ్ళు ఎంత చిన్నగా ఉన్నా కాటుక పెడితే కళ్ళ అందం రెట్టింపు అవుతుంది. కళ్ళకు కాటుక పెట్టుకోవడం వలన అందం ఒక్కటే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
కళ్ళకు కాటుక పెట్టుకుంటే దుమ్ము ధూళి కంటిలోకి వెళ్లదు. సూర్య కిరణాలు కంటి మీద పడితే ఎంత ప్రమాదమో మనకు తెలిసిన విషయమే. అలాంటి సూర్య కిరణాలు కంటి మీద పడకుండా కాటుక కాపాడుతుంది. కాటుక కళ్ళకు చల్లదనాన్ని ఇవ్వటమే కాకుండా మెరిసేలా చేస్తుంది. కళ్ళు ఏ ఆకారంలో ఉన్నా కాటుక పెట్టగానే మంచి ఆకర్షణీయంగా కనబడతాయి.
కాటుక నిద్ర పట్టటానికి కూడా సహాయపడుతుంది. అందుకే ప్రతి అమ్మాయి కాటుక పెట్టుకోవటానికి ఆసక్తి చూపుతుంది. అయితే కాటుక పెట్టుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. మార్కెట్లో దొరికే కాటుకలో కొన్ని కెమికల్స్ ఉండే అవకాశం ఉంది.
కాబట్టి ఇంట్లో తయారు చేసుకున్న కాటుకను పెట్టుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. మార్కెట్లో దొరికే కాటుకలో ఉండే కెమికల్ కారణంగా దురద మంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. దురద మంట వస్తే కాటుక పెట్టుకోవడం మానేయాలి. కాటుక పెట్టుకునే ముందుకు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
ముఖంపై, కళ్లపై ఏమాత్రం తడిలేకుండా తుడుచుకోవాలి.తరువాతే కాటుక పెట్టుకోవాలి. కళ్లకు కాటుక పెట్టుకుంటే శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుందని ఆయుర్వేదంలో చెప్పుతారు. చూశారుగా కళ్ళకు కాటుక పెట్టుకోవటం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో…కాటుక పెట్టుకొని ఈ ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.