Back Pain:నడుము నొప్పి తీవ్రంగా వేధిస్తోందా.. ఈ చిట్కాలతో తరిమికొట్టండి..!
Back Pain Home Remedies: ఈ మధ్య కాలంలో సరైన జీవనశైలి లేకపోవటం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా నడుము నొప్పి అనేది చాలా చిన్న వయస్సులోనే వస్తుంది.
కాల్షియం లోపం కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. వాటిని ఎలా పరిష్కారం చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. కాల్షియం లోపం ఉంటే కాళ్ళ నొప్పులు,శరీరంలో బలహీనత,అలసటగా ఉండటం వంటివి ఉంటాయి. ఈ సమస్యలు కనపడగానే సాధారణంగా ప్రతి ఒక్కరు టాబ్లెట్స్ వేసుకుంటారు.
ఆలా టాబ్లెట్స్ వేసుకోకుండా ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా పాటిస్తే మంచి ఫలితం కనపడుతుంది. నాలుగు బాదం పప్పులను రాత్రి సమయంలో నానబెట్టాలి. మరుసటి రోజు తొక్క తీసి తురమాలి. పొయ్యి మీద గిన్నెలో ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక తురిమిన బాదం వేసి ఒక నిమిషం మరిగించాలి.
ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి రెండు నిమిషాలు మరిగాక గ్లాస్ లో పోసి పావు స్పూన్ పసుపు వేసి బాగా కలిపి కాస్త వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఈ పాలను 15 రోజుల పాటు తాగితే అన్నీ రకాల నొప్పులు తగ్గటమే కాకుండా కాల్షియం లోపం కూడా ఉండదు. కాస్త ఓపికగా ఈ పాలను తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.
కాల్షియం లోపం తక్కువగా ఉన్నప్పుడు ఈ పాలను తాగితే సరిపోతుంది. అదే ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ చెప్పిన విధంగా సూచనలను పాటిస్తూ ఈ పాలను తాగితే చాలా తొందరగా ఆ లోపం నుండి బయట పడవచ్చు. ఈ పాలను తాగటం వలన శరీరంలో నొప్పి, కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనత, ఎముకల నుండి టక్ టక్ అని శబ్ధం అన్నీ తగ్గిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.