Strawberry Ice Cream :స్ట్రాబెర్రీ ఐస్ క్రీం కస్టర్డ్ పౌడర్, క్రీం లేకుండా చేసుకోండి
Strawberry Ice Cream :స్ట్రా బెరీ ఐస్ క్రీమ్స్.. కావాలని పిల్లలు రోజు గోల చేస్తుంటారు. బయట దొరికే ఐస్ క్రీమ్స్ కన్నా ఈజీగా ఇంట్లో తయారు చేసి ఇవ్వండి.
కావాల్సిన పదార్ధాలు
స్ట్రా బెరీలు – 5-6
అరటి పండ్లు – 2
పాలు – 1 లీటర్
చక్కెర – 2-3 టేబుల్ స్పూన్స్
యాలకుల పొడి – ½ టీ స్పూన్
వెనిలీ ఎసెన్స్ – ½ టీ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా స్ట్రా బెరీస్ ని శుభ్రం చేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
2.ఇప్పుడు వేరొక మిక్సి జార్ లోకి రెండు అరటి పండ్లు,పాలు,చక్కెర,యాలకుల పొడి వెనిలా ఎసెన్స్ ,ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్ట్రా బెరీ పేస్ట్ వేసి క్రీమ్ లా గ్రైండ్ చేసుకోవాలి.
3.తయారు చేసుకున్న క్రీమ్ ని ఐస్ క్రీమ్ అచ్చులలోవేసి నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఫ్రిజ్ లో పెట్టాలి.
4.అంతే ఐదారు గంటల తర్వాత చల్ల చల్లని ఐస్ క్రీమ్స్ రెడీ.