Mulakkada Curry:మునక్కాయతో మసాలా కూర ఇలా చేసి చూడండి.. దేనిలోకైనా అదిరిపోతుంది
Mulakkada Curry:మనక్కాడ కూర.. సాంబార్ లో వేసుకునే మునక్కాడతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని అందరికి తెలిసిన విషయమే. మునక్కాడలతో పప్పును యాడ్ చేసి చూడండి కూర అదిరిపోతుంది.
కావాల్సిన పదార్ధాలు
మునక్కాయలు – 2
శనగపప్పు – ½ కప్పు
పచ్చిమిర్చి – 7-8
అల్లం – 2-3 ఇంచ్ లు
ఉప్పు – 1 స్పూన్
ఎండుమిర్చి – 2
జీలకర్ర – ½ టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
పసుపు – ½ టీస్పూన్
కరివేపాకు – ½ కప్పు
తయారీ విధానం
1.ముందుగా మునక్కాడలను పొట్టు తీసి ముక్కలు గా కట్ చేసి పెట్టుకోవాలి.
2.ఒక గిన్నెలోకి శనగపప్పువేసి తగినన్ని నీళ్లను వేసి గంట పాటు నానబెట్టుకోవాలి.
3.ఇప్పుడు శనగపప్పు,మునక్కాడలను కలిపి ఉప్పు యాడ్ చేసుకోని ఐదారు నిమిషాలు ఉడికించి వడకట్టి వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి.
4.వడగట్టిన శనగపప్పును మిక్సి జార్ లో వేసుకోని,అందులోకి ఉప్పు,అల్లం ,పచ్చిమిర్చి యాడ్ చేసుకోని గ్రైండ్ చేసుకోవాలి.
5.ఇప్పుడు కూర కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి.
6.అందులోకి జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.
7.ఇప్పుడు ఉడకించిన మునక్కాడలను వేసి ఫ్రై చేసుకోవాలి.
8.అందలోకి పసుపు,కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పేస్ట్ ని వేసి లోఫ్లేమ్ పై ఉడకించుకోవాలి.
9.చివరగా కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మునక్కాడ పప్పు కూర రెడీ.