Roti Noodles:కేవలం 5 నిమిషాల్లో మిగిలిపోయిన చపాతీల తో నూడుల్స్.. రుచి అదిరిపోతుంది
Roti Noodles:రోటీ నూడిల్స్.. కొద్దిగా ఆలోచించే చేసుకుంటే మిగిలిపోయిన ఏ పదార్ధాలను పారవేయాల్సిన పని ఉండదు. మిగిలిపోయిన వాటితో కమ్మటి స్పెషల్స్ తయారు చేసుకోవచ్చు. మిగిలిన చపాతితో నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
చపాతీలు – 4
క్యాప్సికం -1
క్యారేట్ల్ – 2
ఉల్లిపాయలు – 1
వెల్లుల్లి రెబ్బలు – 5
కెచప్ – 1 ½ స్పూన్
వెనిగర్ – 1 స్పూన్
సోయా సాస్ – 1 స్పూన్
ఉప్పు – ½ స్పూన్
చాట్ మసాలా – ¼ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా చపాతీలను నూడీల్స్ లా పొడవుగా కట్ చేసుకోవాలి.
2.కట్ చేసుకున్న చపాతీ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోండి.
3.క్యాప్సికం ,క్యారట్స్,ఆనియన్స్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
4.స్టవ్ పై బాండీ పెట్టుకోని ఆయిల్ వేసి అందులోకి వెల్లుల్లి తరుగు వేసి వేపుకోవాలి.
5.అందులోకి తరిగిన ఉల్లిపాయలు,క్యాప్సికం,క్యారేట్ ముక్కలు వేసి రంగు మారే వరకు వేపుకోవాలి.
6.ఇప్పుడు అందులోకి టమాటో కెచప్,వెనిగర్ ,సోయాసాస్ వేసి కలుపుకోవాలి.
7.ఇప్పుడు అందులోకి ఉప్పు,చాట్ మాసాల వేసి తయారు చేసుకున్న చపాతీ నూడిల్స్ ని వేసి టాస్ చేసుకోవాలి.
8.స్టవ్ ఆఫ్ చేసి కాసేపు టాస్ చేసుకోని చపాతీ నూడిల్స్ సర్వ్ చేసుకోవడమే..