Kitchenvantalu

Crispy Wheat Flour Dosa :కేవలం 10 నిమిషాల్లో గోధుమపిండితో ఇలా క్రిస్పీ గా దోశలు చేసుకోండి..వేడివేడిగా..

Crispy Wheat Flour Dosa :క్రిస్పి గోధుమ పిండి దోశ.. దోశ అనగానే ముందురోజునుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. పప్పు నానబెట్టడం,పిండి రుబ్బుకోవడం ఇలా హడావిడి లేకుండా,టైం లేనప్పుడు ఇన్ స్టంట్ గా గోధుమ పిండితో క్రిస్పి దోశలు చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 1 కప్పు
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్
పెరుగు – ½ కప్పు
పెప్పర్ పౌడర్ – ½ టీ స్పూన్
ఉప్పు – ½ టీ స్పూన్
వంట సోడా – కొద్దిగా

తయారీ విధానం
1.ముందుగా మిక్సింగ్ బౌల్ లోకి గోధుమ పిండి,బియ్యం పిండి ,ఉప్పు,మిరియాల పొడి ,బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి.
2.1/2 కప్పు పెరుగుకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి దోశపిండిలో కలుపుకోని పిండిని దోశ బ్యాటర్ లా సిధ్దం చేసుకోవాలి.
3.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని దోశ పెనాన్ని వేడెక్కనివ్వాలి.
4.గరిటడు పిండిని ప్యాన్ పై వేసుకోని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి.
5.వేసుకున్న దోశ అంచులపై కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి.
6.దోశను రెండు వైపుల ఎర్రగా కాల్చుకుంటే కరకర లాడే గోధుమ పిండి దోశ రెడీ.