Kajal Aggarwal:స్టార్ హీరోయిన్ కాజల్ ఆస్తులు ఎన్ని వేల కోట్లు తెలిస్తే.. .ఆశ్చర్య పోవాల్సిందే..!
Kajal Aggarwal: తెలుగు,తమిళ చిత్ర రంగంలో 50కి పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ లక్ష్మీకళ్యాణం మూవీతో టాలీవుడ్ లో ఎంటర్ అయింది. అందరి అగ్ర హీరోలతో నటించి , సౌత్ ఇండియా మొత్తం మీద నెంబర్ వన్ స్టార్ డమ్ తెచ్చుకుంది.
తెలుగు సినిమా ఫీల్డ్ లో తక్కువ సమయంలో ఇంతగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న నటి ఇక ఎవరూ లేరని చెప్పాలి. ఎందుకంటే కాజల్ చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈమె సంపాదన గురించి రకరకాల చర్చలు ఉన్నాయి. ఏడాదికి ఎంత సంపాదన చేస్తుంది, ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటుంది వంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి.
రీసెంట్గా కాజల్ తన చిన్ననాటి భాయ్‌ఫ్రెండ్ గౌతమ్‌ను పెళ్లాడి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా..! తన బిడ్డతో హ్యాపీగా ఉన్న కాజల్ ఇప్పుడు పెళ్లి తర్వాత సెకండ్ ఇన్సింగ్స్ కూడా కంటిన్యూ చేస్తూ చాలా బిజీగా ఉంది.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా వస్తోన్న ఇండియన్ 2 సినిమా షూటింగ్లో కాజల్ పాల్గొంటోంది. అదేవిధంగా బాలయ్య 108వ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది.
హైదరాబాద్, బెంగళూరుతో పాటు ఇటు ముంబైలోనూ ఆమెకు ప్లాట్లు, ఖరీదైన లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. ఓ నేషనల్ మీడియా వెబ్సైట్ కథనం ప్రకారం ఆమె వార్షికాదాయం రు. 6 కోట్ల పై మాటే అట. ఇప్పటివరకు కాజల్ 100 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించిందని సమాచారం.