Healthhealth tips in telugu

Lemon and Honey:చలికాలంలో పరగడుపున తేనె,నిమ్మరసం కలిపి తాగుతున్నారా… ఈ విషయం తెలుసుకోండి

Lemon and Honey Benefits in Telugu:చలికాలంలో తీసుకొనే ఆహారం మన ఆరోగ్యం మీద కీలకమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.

ఉదయం సమయంలో తీసుకొనే ఆహారం మన ఆరోగ్యం మీద కీలకమైన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి తీసుకొనే ఆహారం మీద శ్రద్ద తప్పనిసరిగా పెట్టాలి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. మనలో చాలా మంది ఉదయం లేవగానే పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనే,నిమ్మరసం కలిపి త్రాగుతూ ఉంటారు.

తేనే, నిమ్మరసం రెండింటిలోనూ సహజ సిద్ధమైన హీలింగ్ లక్షణాలు ఉంటాయి. పురాతన కాలం నుండి తేనే,నిమ్మరసంలను సహజసిద్ధమైన వైద్యంలో వాడుతున్నారు. ఉదయం పరగడుపున తీసుకుంటే మంచిదని చాలా మంది తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

నిమ్మకాయలో ఆమ్లం జీర్ణప్రక్రియలో సహాయపడి వ్యర్ధాలను,విషాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరంలో ఇన్ఫెక్షన్లను తరిమి కొడుతోంది. అంతేకాకుండా శరీరం నుండి విషాన్ని బయటకు పంపటానికి సహాయపడుతుంది. పెద్దప్రేగు యొక్క పనితీరును మెరుగుపరిచి కడుపును శుభ్రపరుస్తుంది.

జీర్ణంకాని ఆహారం, పేగు కణాలు మరియు చనిపోయిన బ్యాక్టీరియా యొక్క ఉత్పత్తి కారణంగా తరచుగా మన కడుపు లోపలి పొర పూస్తుంది. దాంతో ఆ పరిస్థితి వ్యాధులకు దారి తీస్తుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ మరియు తేనె కలిపి త్రాగటం ద్వారా ప్రేగు యొక్క గోడలు ముఖ్యంగా పెద్దప్రేగు ఉత్తేజితమయి విషాలను బయటకు పంపుతుంది.

ఒకరకంగా చెప్పాలంటే పెద్దప్రేగు యొక్క ప్రక్షాళన జరుగుతుంది. దాంతో శరీరం పోషకాలను గ్రహించడానికి, విషాన్ని వదిలించుకోవడానికి సహాయ పడుతుంది. ప్రేగు కదలికలను ఉత్తేజపరిచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్దకం సమస్య రాకుండా చేస్తుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు ఉదయం పరగడుపున తేనె, నిమ్మరసం కలిపి తీసుకోకూడదు.

ఒకవేళ తీసుకుంటే గ్యాస్ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఈ మిశ్రమాన్ని తాగిన తర్వాత కనీసం ఒక గంట వరకు కాఫీ లేదా టీ తాగకూడదని గుర్తుంచుకోండి. తేనె వాడేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కంపెనీ తేనె కాకుండా ఆర్గానిక్ తేనె వాడితే మంచిది. కాబట్టి తేనె,నిమ్మరసం తాగి ఈ ప్రయోజనాలు పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.