Trivikram Srinivas : త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..
Trivikram Srinivas :మాటల మాంత్రికునిగా పేరుగాంచిన రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే ఓ క్రేజ్ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డమ్ తెచ్చుకున్న డైరెక్టర్స్ లో ఈయన ఒకరు. మొదట్లో మాటల రచయితగా ఎంట్రీ ఇచ్చి తన పదునైన సంభాషణలతో అతి తక్కువ సమాయంలో మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆతర్వాత డైరెక్టర్ గా కూడా త్రివిక్రమ్ తన సత్తా చాటుతూ, పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఎన్నో హిట్స్ అందించగా,అందులో చాలావరకూ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. దాదాపు ఇప్పుడున్న అందరి కుర్ర హీరోలతో కూడా చేసి హిట్స్ అందించాడు. బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. తన మాటలతో చాలామందిని మోటివేట్ చేస్తుంటారు. అంతేకాదు తనకొచ్చే డబ్బుల్లో పేద విద్యార్థులకు వెచ్చిస్తుంటారు.
అనాధ ఆశ్రమాలకు,ఫౌండేషన్స్ కి సాయం అందించే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏడాదికి సంపాదన ఎంత,ఒక్కొక్క సినిమాకు ఎంత తీసుకుంటాడు వంటి విషయాల్లోకి వెళ్తే,ఈయన ఆస్థి 135 కోట్లు ఉంది. ఒక్కొక్క సినిమాకు రూ.18 కోట్ల నుంచి రూ.20కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు.
ఇప్పుడు మహేశ్ బాబు మూవీ కోసం రూ.22కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయనకు మూడు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.వీటి విలువ రూ.5కోట్ల వరకు ఉంటుంది. అలాగే బంజారా హిల్స్ లో ఆయన ఉంటున్న ఇల్లు ఖరీదు రూ.18కోట్లు అని సమాచారం.