Kitchenvantalu

Bellam Thalikalu:పక్కా కొలతలతో బెల్లం తాలికలు ఇలా చేసి చూడండి.. Sweet తినని వారు కూడా తింటారు

Bellam Thalikalu:బెల్లం తాలీకలు.. వినాయక చవితి స్పెషల్ గా చేసుకునే తాలికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. బెల్లం కాంబినేషన్ కమ్మటి ప్రసాదం ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం పిండి – 1 కప్పు
తురుమిన బెల్లం – 1 కప్పు
తురుమిన కొబ్బరి – 1 కప్పు
డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా
యాలకులు పొడి – 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.ముందుగా ఒక గిన్నెలోకి కప్పు బియ్యం పిండికి 1 ½ కప్పు నీళ్లను వేసి కలుపుకోవాలి.
2.చిటికెడు ఉప్పు ,కొద్దిగా బటర్ కాని నూనె కాని వేసి మరిగించుకోవాలి.
3. ఈ నీళ్లను స్టవ్ పై పెట్టుకోని మరిగించుకోవాలి.
4.మరుగుతున్న సమయంలో కప్పు బియ్యం పిండిని వేసి కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
5.మూత పెట్టుకోని రెండు ,మూడు నిమిషాలు పక్కన పెట్టాక వేరొక గిన్నెలోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి.
6.ఉడికిన పిండిని పొడి పిండి సాయంతో తాలికలు తయారు చేసుకోవాలి.
7.ఒకదానికి ఒకటి అతక్కోకుండా తాలికలు సిధ్దం చేసుకోవాలి.
8. ఇప్పుడు బెల్లం తాలికల కోసం స్టవ్ పై వెడల్పాటి ప్యాన్ పెట్టుకోని డ్రై ఫ్రూట్స్ని బటర్ వేసి వేపుకోవాలి.

9.ఇప్పుడు అదే ప్యాన్ లో నాలుగు నుండి ఐదు కప్పుల నీళ్లను వేసుకోని వేడి చేయాలి.
10.అందులోకి కప్పు బెల్లం తురుము వేసి కరిగించుకోవాలి.
11. బెల్లం కరిగాక అందులోకి తయారు చేసుకున్న తాలికలను వేసుకోవాలి.ఎక్కువగా కలపకూడదు.
12.ఇప్పుడు అందులోకి కొబ్బరి పొడి వేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి.
13.ఇప్పుడు వేరొక బౌల్ లోకి నీళ్లు,రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని వేసి పేస్ట్ లా కలుపుకోవాలి.
14. కలుపుకున్న పేస్ట్ ని బెల్లం తాలికలలో వేసి కలుపుకోవాలి.
15.దీనివల్ల పానకం కాస్తా తిక్ నెస్ వస్తుంది.
16.మరో రెండు నిమిషాలు మరింగిచి యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెల్లం తాలికలు రెడీ.