Feet Swelling :పాదాల వాపు, నొప్పులకు చెక్ పెట్టాలంటే…ఇలా చేస్తే జీవితంలో ఉండవు
Feet Swelling Home Remedies:గర్భధారణ సమయంలో పాదాల వాపులు రావటం అనేది సహజమే. కానీ మాములుగా ఉన్నవారికి పాదాల వాపులు వస్తే జాగ్రత్తగా ఉండాలి. పాదాల వాపును ఎడిమ అని పిలుస్తారు.
రోజు అంతా నిల్చుని పని చేసిన లేదా కూర్చొని పని చేసిన పాదాల వాపులు వస్తూ ఉంటాయి. సమస్య చిన్నగా ఉన్నా దీనిని అశ్రద్ధ చేస్తే మాత్రం చాలా సమస్యలకు గురి కావాల్సి ఉంటుంది.అంతేకాక పాదాల వాపులు భవిష్యత్ లో గుండె సమస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే. పాదాల వాపులను ప్రారంభంలో తగ్గించుకోవచ్చు.
రక్తప్రసరణ సరిగా లేకపోవటం వలన ఈ సమస్య వస్తుంది. అందువల్ల రోజులో నిల్చోవటం మరియు కూర్చోవటం రెండు సమానంగా చేయాలి. గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండాలి. పుదీనా ఆయిల్ తో వాపు ఉన్న ప్రదేశంలో మసాజ్ చేస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది.క్యారట్, బీట్‌రూట్, ఆకుకూరలు, మునగకాడలు, దానిమ్మ, జామ, సీతాఫలం, బొప్పాయి వంటివి డైట్‌లో చేర్చుకోవాలి.
సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి. ఒక బకెట్ లో గోరువెచ్చని నీటిని పోసి దానిలో రెండు స్పూన్ల ఉప్పు వేసి బాగా కలిపి పాదాలను దానిలో పెట్టుకొని పావుగంట సేపు ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే లవంగం నూనెతో మసాజ్ చేసిన మంచి ఫలితం ఉంటుంది.
అలాగే ఒక గ్లాస్ నీటిని పొయ్యి మీద పెట్టి దానిలో ఒక స్పూన్ ధనియాలను వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి ఉదయం పరగడుపున తాగితే శరీరంలో ఉన్న వాపులు తగ్గుతాయి. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇంటి చిట్కా ఫాలో అవవ్వచ్చు. సమస్య పెద్దగా ఉంటే డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇంటి చిట్కాలను పాటించవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.