Sweet Corn Soup:రెస్టారెంట్ స్టైల్ లో స్వీట్ కార్న్ సూప్.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారుచేసుకోండి
Sweet Corn Soup: వానలు వస్తున్నాయి. దాంతో వాతావరణం చాలా చల్లగా ఉంది. ఈ సమయంలో వేడి వేడిగా సూప్ తాగితే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ లో చాలా సులభంగా ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు. సూప్ కి కావలసిన పదార్ధాలు,తయారి విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సూప్ కి అవసరమైన వస్తువులు అన్ని సులభంగానే అందుబాటులో ఉంటాయి.
కావలసిన పదార్ధాలు
స్వీట్ కార్న్ – పావుకప్పు
నీళ్లు -అరలీటర్
తరిగిన క్యాబేజీ – 3 టేబుల్ స్పూన్లు
తరిగిన క్యారెట్ – చిన్నది
వెనిగర్ – 1 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
పంచదార – అర టీ స్పూన్
మిరియాలపొడి – అర టీ స్పూన్
కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్
స్ప్రింగ్ ఆనియన్స్ – 3 టేబుల్ స్పూన్లు
తయారి విధానం
ముందుగా మిక్సీ జార్ లో స్వీట్ కార్న్ వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్ తీసుకోని దానిలో కొంచెం నీటిని పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి అరలీటర్ నీటిని పోసి కాస్త వేడి అయ్యాక…దానిలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్, తరిగిన క్యారెట్, క్యాబేజీతో పాటు మరో రెండుస్పూన్ల స్వీట్ కార్న్ గింజలు వేసి పది నిమిషాల వరకు ఉడికించాలి.
ఆ తర్వాత వెనిగర్, మిరియాలపొడి, పంచదార, ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి.నీటితో కలిపి పెట్టుకున్న పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి కొంచెం చిక్కబడేలా ఉడికించాలి. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే.. వేడి వేడి ఆరోగ్యకరమైన మరియు టేస్టీ స్వీట్ కార్న్ సూప్ రెడీ.