Tollywood:’అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సినిమాలో వాణిశ్రీ పారితోషికం ఎంతో తెలుసా..?
Chiranjeevi Attaku yamudu ammayiki mogudu :చిరంజీవి సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిరంజీవి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఓ బోగరుబోతు అత్తకు బుద్ధి చెప్పే అల్లుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ 1989లో రిలీజై ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786వంటి చిత్రాలతో మంచి ఊపు మీదున్న సుప్రీం స్టార్ చిరంజీవి ఈ సినిమాతో మెగాస్టార్ అయ్యాడు.
చిరంజీవితో భారీ సినిమా తీయాలని ఏ కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో హాలీవుడ్ స్థాయిలో ప్లాన్ చేసారు. మరి ఎందుకో ఈ మూవీ ఆగిపోయింది. దీంతో కథ మార్చేసి, ఈ ప్రాజెక్ట్ భారీగా చేయడానికి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ భావించి, సత్యానంద్ ని ఓ కథ రెడీ చేయమన్నారు. అత్తా అల్లుళ్ళ మధ్య సరదా సంభాషణలో సాగేలా రెడీ చేసిన ఈ కథ అందరికీ నచ్చేసింది.
సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం తదితర తారాగణం రెడీ. ఇక అత్త పాత్ర కోసం జమునను అడగాలని అనుకున్నారు. అయితే అప్పటికే 8 ఏళ్ళక్రితం ఇండస్ట్రీని వదిలేసిన వాణిశ్రీని దృష్టిలో పెట్టుకుని సత్యానంద్ కథ రాయడంతో ఆవిడను అడిగారు. హీరోతో సమాన రేంజ్ కావడంతో ఒకే. పైగా, అప్పట్లో హీరోయిన్ కన్నా రెండు రెట్లు అధికంగా రెమ్యునరేషన్ ఇచ్చారట.
1988ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభం. టైటిల్ యముడు, మొగుడు అనే పేర్లు ఉండేలా టైటిల్స్ అంతకుముందు రావడంతో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనే టైటిల్ ఖాయం చేసారు. మద్రాసు వాహిని తదితర స్టూడియోస్ తో పాటు బెంగళూరులో షూటింగ్ పూర్తిచేశారు. కోటి రూపాయల బడ్జెట్ తో పూర్తిచేసిన ఈ మూవీ 1989జనవరి 14న రిలీజయింది.
చిరు, కోదండరామిరెడ్డి హిట్ కాంబినేషన్, చిరు డాన్స్,ఫైట్స్, కామెడీ, అత్తా అల్లుళ్ళ సవాళ్లు, చాలా గ్యాప్ తర్వాత వాణిశ్రీ ఎంట్రీ, చక్రవర్తి సాంగ్స్ వెరసి ఈ మూవీ ని ఇండస్ట్రీ హిట్ చేశాయి. చిరు పండించిన కామెడీ, డాన్స్ ఫాన్స్ కి పిచ్చెక్కించాయి. విజయశాంతి యాక్టింగ్ చెప్పక్కర్లేదు. పొగరుబోతు అత్తగా వాణిశ్రీ సూపర్భ్ . కోదండరామిరెడ్డి టేకింగ్ అదుర్స్ .
వైజాగ్ అలంకార్ లో 106డేస్, రాజమండ్రి అశోకాలో 104డేస్ ఫుల్స్ అయ్యాయి. 14సెంటర్స్ లో 100డేస్ ఆడి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. 1987నుంచి వరుస ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన హీరోగా నిలిచాడు. 5కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీని తమిళంలో రజనీకాంత్ హీరోగా రిమేక్ చేస్తే హిట్ అయింది. 1989జూన్ 24న రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఈ సినిమా 100డేస్ ఫంక్షన్ జరిగింది. దాసరి నారాయణరావు చీఫ్ గెస్ట్ గా వచ్చారు.