Kitchenvantalu

Hyderabadi Special Egg Curry:హైద‌రాబాదీ స్పెష‌ల్ ఎగ్ క‌ర్రీ.. రుచికి రుచి, పోష‌కాల‌కు పోష‌కాలు..!

Hyderabadi Special Egg Curry:పుట్నాల పొడితో ఎగ్ కర్రీ.. హైదరాబాదీ స్పెషల్ పుట్నాల పొడితో ఎగ్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేసారా లేదంటే ఈ సారీ ట్రై చేయండి. డిఫరెంట్ గా,ఈజీగా తయారు చేసుకోవచ్చు,రోటి అన్నంలోకి సూపర్ కాంబినేషన్.

కావాల్సిన పదార్ధాలు
ఉడికించిన గుడ్లు – 5
ఉల్లిపాయలు – 3
పుట్నాల పొడి – తగినంత
పసుపు – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ స్పూన్
కారం – 1 ½ స్పూన్
ఉప్పు – 1 స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్

తయారీ విధానం
1. ముందుగా గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి జీలకర్ర,ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి.
3. ఉల్లిపాయలు వేగాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
4. అందులోకి కారం,ఉప్పు,ధనియాల పొడి వేసి ఉడకపెట్టిన గుడ్లకు ఫోర్క్ తో రంధ్రాలు చేసి వేసుకోని రెండు,మూడు నిమిషాలు కలుపుతూ వేపుకోవాలి.
5. వేగిన గుడ్లలోకి పుట్నాల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి.
6.అంతే గుడ్డు పుట్నాల పొడి కర్రీ రెడీ.