Kitchenvantalu

Chintakaya Dappalam:చింతకాయ దప్పడం.. అమ్మమ్మ కాలం నాటి వంట.. రుచి జన్మలో మర్చిపోరు

Chintakaya Dappalam:చింతకాయ దప్పలం.. టేస్టీ అండ్ సింపుల్ పచ్చి చింతకాయ దప్పలం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
పచ్చి చింతకాయలు – ¼ kg
తరిగిన కూరగాయలు – తగినన్ని
ఉల్లిపాయ -1
పచ్చమిర్చి – రుచికి సరిపడా
పసుపు – ½ టీ స్పూన్
ధనియాల పొడి – 1 స్పూన్
జీలకర్ర మెంతుల పొడి – ¼ టీ స్పూన్
ఉప్పు -1 స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్
తాలింపు కోసం
ఆవాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
మిరపకాయలు -4-5
కరివేపాకు – 1 రెమ్మ

తయారీ విధానం
1.ముందుగా నచ్చిన కూరగాయలు,పచ్చిమిర్చి ,ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. చింతకాయలను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మునిగేల నీటిని నింపుకోవాలి.
3.చింతకాయ నీటితో పాటుగా ఉడకించుకోవాలి.
4.చింతకాయలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
5.ఉడికిన చింతకాయలను వడగట్టుకోవాలి.

6.వడగట్టిన చారులో కూరగాయలు ,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసుకోవాలి.స
7.అందులోకి పసుపు,ధనియాల పొడి,జీలకర్ర మెంతుల పొడి,ఉప్పు,పచ్చిమిర్చి,కరివేపాకు,కొత్తిమీర అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించుకోవాలి.
8.ఒక గిన్నెలోకి బియ్యం పిండిని నీళ్లతో చిక్కని పేస్ట్ లా కలుపుకోని మరుగుతున్న చారులో కలుపుకోవాలి.
9.మరిగిన దప్పనం లో తాలింపుకోసం స్టవ్ పై బాండీ పెట్టుకోని అందులోకి ఆయిల్ వేసి అందులోకి తాలింపులు వేసి ఎండుమిర్చి ,కరివేపాకు వేసి వేగిన తాలింపును దప్పనం లో కలుపుకోవాలి.
10.అంతే చింతపండు దప్పనం రెడీ.