Kitchenvantalu

Dondakaya Senagapappu:పర్ఫెక్ట్ టేస్ట్ తో ఇలా దొండకాయ కర్రీ చేసారంటే ఇంట్లో పండగే..

Dondakaya Senagapappu:పప్పు దొండకాయ కర్రీ.. దొండకాయ కూర ఇష్టపడని వారి కోసం పప్పు కాంబినేషన్ లో చేసి పెట్టండి. తప్పకుండా నచ్చుతుంది.దొండకాయ శనగపప్పు కూరను టేస్టీగా ,ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
దొండకాయలు – ¼ kg
శనగపప్పు – ½ కప్పు
వెల్లుల్లి రెబ్బలు – 4-5
ఉల్లిపాయలు-1
పచ్చిమిర్చి – 4-5
కరివేపాకు – ½ కప్పు
పసుపు – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా దొండకాయలను కట్ చేసి పెట్టుకోవాలి.
2.శనగపప్పును అరగంటపాటు నానబెట్టుకోవాలి.
3.ఇప్పుడు కుక్కర్ లోకి ఆయిల్ వేడి చేసి అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోవాలి.
4.అందులోకి ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి.

5.ఉల్లిపాయలు వేగాక అందులోకి పచ్చిమిర్చి ,కరివేపాకు,పసుపు వేసి కలుపుకోని దొండకాయ ముక్కలను యాడ్ చేయాలి.
6.మూత పెట్టి రెండు మూడు నిమిషాలు దొండకాయలను ఉడకనివ్వాలి.
7.దొండకాయలు కాస్తా ఉడికాక నానబెట్టుకున్న శనగపప్పును వేసి కలుపుకోవాలి.
8.అందులోకి ఉప్పు,గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
9.ప్రెజర్ పోయిన తర్వాత తీసి మూత తీసి మరో రెడు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.