Beauty Tips

Skin Care With Banana : అరటిపండుతో అందం.. వారానికోసారి ఇలా చేస్తే చాలు

Skin Care With Banana : అరటిపండుతో అందం.. వారానికోసారి ఇలా చేస్తే చాలు..అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందరూ మీ వైపు చూడాలని మనసులో అనుకుని ఉంటారు కదా.

మరి అలా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే.. చాలు. మీ స్కిన్ చూసి వావ్ అంటారు. అరటిపండు కూడా ఉపయోగిస్తే.. అందానికి ఎంతో మేలు కలుగుతుంది.
సాదారణంగా వయస్సు పెరిగే కొద్ది ముడతలు వస్తూ ఉంటాయి. అయితే ఈ రోజుల్లో వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న వయస్సులోనే ముడతలు వచ్చేస్తున్నాయి.

చర్మం మీద ముడతలు రావటం వలన చర్మం నిస్తేజంగా కనపడటమే కాకుండా నిదానంగా మృదుత్వాన్ని కూడా కోల్పోతుంది. ముడతలు ప్రారంభ దశలో ఉంటే చికిత్స చేయటం చాలా సులభం. ముడతల పరిష్కారానికి తేనే ఫేస్ పాక్స్ బాగా సహాయపడతాయి.

ముఖానికి తేనే రాయటం వలన మొటిమలు,నల్లని వలయాలు,సోరియాసిస్, పొడి చర్మం,మచ్చలు, గోధుమ మచ్చలు వంటి అనేక చర్మ సమస్యలు పరిష్కారం అవుతాయి. తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ ,నయం చేసే లక్షణాలు ఉండుట వలన దెబ్బతిన్న చర్మ కణాలను మరమత్తు చేస్తుంది.

ఇప్పుడు తేనే మరియు కొన్ని ఇతర పదార్దాలను ఉపయోగించి కొన్ని రకాల ఫేస్ మాస్క్ లను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. అరటి పండు, అవోకాడో మరియు హనీ ఫేస్ మాస్క్ – కళ్ళ చుట్టూ ముడతలు,వృదాప్య లక్షణాలను తొలగించటానికి మరియు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచటానికి ఈ యాంటీ ఏజింగ్ మాస్క్ సహాయ పడుతుంది.

ఇంటిలో తయారుచేసుకొనే ఈ మాస్క్ లో అరటిపండు,అవోకాడో, తేనే వంటి గొప్ప తేమ పదార్థాలు ఉన్నాయి. అరటిపండులో ఆక్సీకరణ మరియు ఖనిజాలు ఉండుట వలన ముడతలతో పోరాటం చేసి చర్మం మెరిసేలా చేస్తుంది. అవోకాడోలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి, ఇ, బి కాంప్లెక్స్ ఉండుట వలన చర్మానికి పోషణ మరియు కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది.

తేనే చర్మానికి సహజంగా మృదుత్వాన్ని కలిగించటమే కాకుండా ఫైన్ లైన్ మరియు సాగిన చర్మాన్ని సంరక్షించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా అరటిపండు,అవోకాడో తొక్కలను తీసేయాలి. ఒక మిక్సింగ్ బౌల్ లో అరటిపండు,అవోకాడో వేయాలి.

ఒక ఫోర్క్ సాయంతో అరటిపండు,అవోకాడోలను మెత్తని పేస్ట్ గా చేయాలి. అరటిపండు ,అవోకాడో మిశ్రమంలో తేనే వేసి బాగా కలపాలి. డీప్ లైన్స్,సాగిన చర్మ ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని రాయాలి. 20 నిమిషాల వరకు అలా వదిలేస్తే పొడిగా మారుతుంది. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. కళ్ళ చుట్టూ ముడతలు పోవటానికి, చర్మం కాంతివంతంగా మారటానికి ఈ ప్యాక్ వారంలో రెండు సార్లు వేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.