MoviesTollywood news in telugu

Okkadu Movie :మహేష్ ‘ఒక్కడు’ సినిమా టైటిల్ వెనక …ఇంత కథ జరిగిందా…నమ్మలేని నిజం

Mahesh Babu Okkadu Movie :మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యాడు.

కొన్ని సినిమాలు కొందరి కోసమే ఉంటాయని అంటారు. చాలామంది విషయంలో ఇది రుజువైంది. ఇక అక్షరాలా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు విషయంలో ఇంకా నిర్ధారణ అయింది. మహేష్ హీరోగా వచ్చిన ఒక్కడు మూవీ సాధించిన సంచలన విజయం ఫాన్స్ కి పండగ జరిపించింది.

2003 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా టాలీవుడ్‌లో అనేక రికార్డులు తిరగ రాసింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఎం ఎస్ రాజు తీసిన ఈ మూవీలో భూమిక హీరోయిన్ గా చేసింది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ‘ఒక్కడు’ సినిమాలో మహేశ్‌బాబు, భూమిక, ప్రకాశ్‌ రాజ్‌ల‌ నటన అదిరిపోయింది.

ఇక ఈ మూవీకోసం ప్రత్యేకంగా వేసిన కొండారెడ్డి బురుజు, చార్మినార్‌ సెట్లు, మణిశర్మ సంగీతం ఇలా అన్నీ ఈ సినిమా రేంజ్ ని పెంచేసాయి. కొండా బురుజు వద్ద ప్రకాశ్‌రాజ్‌ని మహేశ్‌బాబు కొట్టే సన్నివేశం సినిమాకే హైలెట్‌. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ పేలాయి. అయితే ఈ సినిమాకు ‘ఒక్కడు’ అని టైటిల్ పెట్టడం వెనుక పెద్ద కారణం ఉందట. నిజానికి స్పోర్ట్ బ్యాక్‌ డ్రాప్‌తో మహేష్ మూవీ తీయాలని గుణశేఖర్ అనుకున్నాడట.

ఖర్చుకి వెనుకాడకుండా తీసే నిర్మాత, అదిరిపోయే నటనగల హీరోయిన్, ఆర్ట్‌ డైరెక్టర్, సంగీత దర్శకుడు, మాటల రచయిత. ఇలా అన్నీ సిద్ధం అయిపోయాయి. అయితే టైటిల్‌ విషయం తేలలేదు. తొలుత ఈ సినిమాకు ‘అతడే ఆమె సైన్యం’ అనే పేరు అనుకున్నారట. అయితే అలాంటి టైటిల్‌ అప్పటికే రిజిస్టర్ అయినట్లు తెలిసింది.

ఆ తర్వాత ‘కబడ్డీ’ అనే టైటిల్ అనుకున్నప్పటికీ గుణశేఖర్‌కు నచ్చలేదట. చివరికి ఎన్నో రోజులు ఆలోచించి చివరికి ‘ఒక్కడు’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసేసాడు.