Capsicum Benefits :కాప్సికమ్ తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
Capsicum Benefits : కాప్సికమ్ ని బెల్ పెప్పర్ ,బెంగుళూర్ మిర్చి అని పిలుస్తారు. మార్కెట్ లో ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉన్న కాప్సికమ్ లభ్యం అవుతుంది. అయితే ఇప్పుడు షాపింగ్ మాల్‌లు, సూపర్ మార్కెట్లలో ఎరుపు, పసుపు రంగులో ఉండే కాప్సికమ్ దొరుకు తున్నాయి. కాప్సికమ్ ఏ రంగులో ఉన్నా సరే పోషకాలు ఒకేలా ఉంటాయి.మిరపకాయల్లో మంటను కలిగించే ‘కాప్సయిసిన్’ లేకపోవడంవల్ల కాప్సికమ్ మామూలుగా ఉంటుంది.
కమలాపళ్లలో కన్నా వీటిలో సి విటమిన్ ఎక్కువ ఉంటుందని చాలా మందికి తెలీదు.కాప్సికమ్ లో విటమిన్ ఎ, సి మరియు ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్, కోబాల్ట్, జింక్, కాపర్, మెల్డినిమ్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి అనేక మినిరల్స్ ఉంటాయి.
కాప్సికమ్ ని ఎక్కువగా సలాడ్స్ మరియు వంటల్లో వాడతారు. కాప్సికమ్ వంటలకు ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. కాప్సికమ్ లో ఎన్నో ఔషధగుణాలు ఉండుట వలన రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బరువు అధికంగా ఉన్నవారికి కాప్సికం మంచి ఆహారం అని చెప్పవచ్చు. శరీరంలో కేలరీలను అద్భుతంగా తగ్గిస్తుంది. అలాగే చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పిత్తి చేసే చర్యలను ఇది ప్రోత్సహిస్తుంది.క్యాప్సికమ్ లో కేయాన్ సమృద్ధిగా ఉండుట వలన నొప్పులను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీనితో తయారుచేసిన క్రీమ్స్ ని నొప్పి నివారిణిగా వాడుతున్నారు.
ఆర్థరైటిస్ మరియు రుమటాయిడ్స్ నొప్పులను తగ్గిస్తుంది. కాప్సికమ్ లో ఉన్న కాప్సిసిన్స్ రక్తంలో కలిసి క్యాన్సర్ మీద పోరాటం చేస్తాయి. కాప్సికమ్ లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండుట వలన కంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఆస్తమా వంటి శ్వాస కోశ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది.
కాప్సికమ్ లో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన ఫంగల్ ఇన్ పెక్షన్స్ మరియు బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్స్ ని సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.క్యాప్సికమ్ తినడం వల్ల రక్తం గడ్డకట్టదు.
ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుంది . దాంతో స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. క్యాప్సికమ్‌లో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. ఆయా అవయవాల్లో ఉండే కణాలకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా చూస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.