Kitchenvantalu

Usirikaya Pachadi:అప్పటికప్పుడు చేసుకొనే ఉసిరికాయ పచ్చడి ఒక్కసారి చేస్తే.. పక్కా కొలతలతో..

UsiriKaya Pachadi:ఉసిరికాయ పచ్చడి.. సీ విటమిన్ పుష్కలంగా లభించే ఉసిరికాయ పచ్చడి సీజన్ తప్పకుండా తినాల్సిందే. ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి. కమ్మని ఉసిరికాయ పచ్చడి అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
ఉసిరికాయలు – 6
ఎండుమిర్చి – 10-11
జీలకర్ర – 1 స్పూన్
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 7-8
ఉప్పు – తగినంత
ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్
తాలింపులు – 1 స్పూన్

తయారీ విధానం
1.ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోని విత్తనాలు తీసివేయాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి ఆయిల్ వేసి శనగపప్పు ,ఎండుమిర్చి ,ధనియాలు ,జీలకర్ర,మెంతులు వేసి వేపుకోవాలి.
3.స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
4.ఇప్పుడు మిక్సి జార్ లోకి పప్పు,ఉప్పు,వేపుకున్న పదార్ధాలన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
5.అందులోకి ఉసిరికాయ ముక్కలను వేసి గ్రైండ్ చేసుకోవాలి.
6.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి ఆవాలు,జీలకర్ర ,ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.
7.పసుపు,కరివేపాకు వేసి వేగిన తాలింపులోకి గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ ని వేసి కలుపుకోవాలి.
8.అంతే ఉసిరికాయ పచ్చడి రెడీ.