Bitter Gourd Seeds: కాకరకాయ గింజలని పారేయకండి.. వారికి చాలా ప్రయోజనాలు..!
Bitter Gourd Seeds Benefits : కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినటానికి ఇష్టపడరు. కాకరకాయలో ఎన్నో పోషకాలు,ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కాకరకాయ గింజలలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. కాకరకాయ చేదుగా ఉన్నట్లే దాని గింజలు కూడా చేదుగా ఉంటాయి. ఈ కారణంగా చాలా మంది వాటిని తినరు
కాకరకాయ గింజలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ సమృద్దిగా ఉంటాయి. కాకరకాయ గింజలు డయాబెటిస్ నిర్వహణలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఈ గింజలు ఒక వరం అని చెప్పవచ్చు.
కాకర గింజలను బాగా ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. చిటికెడు కాకరకాయ గింజల పొడిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇవి రక్తంలో చక్కెర, గుండెపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలని తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో వచ్చే మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ గింజల పొడిని తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. జీర్ణ సంబంద సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజన్ మారినప్పుడు వచ్చే ఆస్తమా, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. చర్మాన్ని ముడతలు లేకుండా ఉంచడంలో, అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇప్పటి నుంచి కాకరకాయ కూరగా చేసినప్పుడు గింజలు అలానే ఉంచి వండితే వాటిలో ఉన్న ప్రయోజనాలు కూడా మన శరీరానికి అందుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.