Mustard Oil During Winters। శీతాకాలంలో ఆవనూనెతో అవాక్కయ్యే ప్రయోజనాలు తెలుసా?
Mustared oil Benefits in telugu :మనం ప్రతిరోజు వంటల్లో ఆవాలను ఉపయోగిస్తాం. ఆవాలులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఆవాలు నుంచి తీసిన నూనెను వంటల్లో వాడితే చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువగా వంటలకు సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఉంటారు. అలాకాకుండా ఆవనూనె వాడితే మంచిదని అంటున్నారు.ఇక ప్రయోజనాల విషయానికి వస్తే ఆవనూనె చెడు కొలెస్ట్రాల్ కరిగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలాగా ప్రోత్సహించి గుండె జబ్బులు రాకుండా రక్షణగా ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
అలాగే యాంటీ బాక్టీరియా,యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన ఆవనూనె ఇన్ఫెక్షన్స్ రాకుండా జీర్ణవ్యవస్థను కాపాడుతుంది..తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా ఈ నూనె చాలా బాగా సహాయపడుతుంది.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నవారికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. వంటలలో ఆవనూనె వాడితే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. .కాబట్టి మీకు వీలు అయితే ఆవనూనెను వాడటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.