Healthhealth tips in telugu

Ginger:చలికాలంలో పరగడుపున 1 స్పూన్ అల్లం రసం తాగితే…

Ginger Juice Benefits in telugu : అల్లంలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం సీజనల్ గా వచ్చే సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లం రసం తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

అల్లంను శుభ్రం కడిగి పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ లో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని పలుచని క్లాత్ సాయంతో వడకట్టి సీసాలో నిల్వ చేసుకొని ఫ్రిజ్ లో పెడితే నాలుగు రోజులు నిల్వ ఉంటుంది. ఇలా అల్లం రసం తీసుకోవటం వలన అల్లంలో ఉండే యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు దగ్గు,జలుబు,గొంతు నొప్పిని తగ్గిస్తాయి.

ఈ సీజన్ లో చాలా తరచుగా గొంతుకి సంబందించిన సమస్యలు వస్తాయి. దానికి కారణం అయిన బ్యాక్టీరియాను నివారించి గొంతుకి సంబందించిన సమస్యలు రాకుండా కాపాడుతుంది. అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన అన్ని రకాల నొప్పులను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

అలాగే పొట్టకు సంబందించిన సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ప్రతి రోజు ఖచ్చితంగా అల్లం రసం తీసుకుంటే నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది.
అలాగే రక్త ప్రవాహంలో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది.

రక్తంను పల్చగా మార్చి, రక్తప్రవాహాన్ని పెంచుతుంది. దాంతో రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ముఖ్యంగా మొటిమలను తగ్గిస్తుంది. మొటిమలకు కారణం అయినా బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.