Healthhealth tips in telugu

Joint Pains: చలికాలంలో కీళ్ళనొప్పులు నరకం చూపిస్తున్నాయా? ఉపశమనం కోసం ఈ చిట్కాలు పాటించండి!!

Pain Killer at Home : ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదొక సమయంలో ఏదో ఒక నొప్పితో బాధ పడుతున్నారు. ఆ నొప్పుల నుండి ఉపశమనం కొరకు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. అలా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

అలా కాకుండా సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. నొప్పులను తగ్గించటానికి ఆవనూనె, ముద్ద కర్పూరం అనేవి దివ్య ఔషదాలుగా చెప్పవచ్చు. ఆవనూనెలో ముద్ద కర్పూరం కలిపి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేసి వేడి నీటితో కాపడం పెట్టాలి.

ఈ విధంగా చేస్తే కండరాల నొప్పులు, బాడీ పెయిన్స్, కాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు,మెడ,నడుము నొప్పి అన్ని రకాల నొప్పులు తగ్గిపోతాయి.కర్పూరం నొప్పి,వాపుకు అద్భుతంగా పనిచేస్తుంది. కర్పూరం నొప్పికి కౌంటర్ గా చికాకుని కలిగిస్తుంది, అందువల్ల నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం కలుగుతుంది.

ఆవ నూనెలో చాలా సమృద్ధిగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. కీళ్ళనొప్పులతో సంబంధం ఉన్న కీళ్ల దృడత్వం మరియు నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.శరీరంలో నొప్పి ఉన్న ప్రదేశంలో రక్తప్రసరణను పెంచి నొప్పి నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

నొప్పులు రాగానే మందుల షాప్ కి పరిగెత్తవలసిన అవసరం లేదు. ఇలా ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. చాలా తక్కువ ఖర్చులో నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఒక్కసారి ఈ నూనెను తయారుచేసుకుంటే చాలా రోజుల వరకు వాడుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.