White Hair Turn Black:తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మార్చేయండి.. ఈ కొబ్బరి నూనెలో కలిపి చిన్ని చిట్కాతో..
White Hair Turn black:ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావటంతో చాలా కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తున్నారు. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
అలాగే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ చిట్కా కోసం కేవలం రెండు ఇంగ్రిడియంట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. 5 స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక స్పూను నిమ్మరసం వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే రక్త ప్రసరణ బాగా పెరిగి జుట్టు సహజంగా నల్లగా మారడం ప్రారంభం అవుతుంది.
శరీరంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు తెల్ల జుట్టు రావడం ప్రారంభం అవుతుంది. తెల్ల జుట్టు కణాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏర్పడటం ప్రారంభం అవుతుంది. అప్పుడు తెల్లజుట్టు రావటం ప్రారంభం అవుతుంది. ఈ సమస్యను తగ్గించటానికి కొబ్బరి నూనె, నిమ్మరసం బాగా సహాయపడతాయి.
తెల్ల జుట్టు లేని వారు కూడా ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాస్తే చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య తగడమే కాకుండా తెల్లజుట్టు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.