White Hair:కేవలం 5 నిమిషాల్లో తెల్లజుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది…
white hair to black in telugu :సాధారణంగా జుట్టు అనేది వయస్సు పెరిగే కొద్దీ రంగు మరియు పటుత్వం కోల్పోయి తెల్లగా మారుతుంది, అలాగే జన్యుపరమైన సమస్యలు ,వంశపారంపర్య కారణాలు, అనారోగ్య కారణాల వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. జుట్టు అనేది నల్లగా ఉంటేనే అందం.
జుట్టు తెల్లబడటం ప్రారంభం కాగానే చిన్న వయస్సులో ఉన్నవారు మానసికంగా కృంగిపోతున్నారు. బయటకు రావాలంటే కాస్త ఇబ్బంది పడుతున్నారు. మన జుట్టు రంగు చిన్న వయసులోనే నిర్ణయించబడుతుంది. మన వెంట్రుకల క్రిందిభాగంలో ఉండే మెలానో సైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి.
మన శరీరంలోని మెలానిన్ స్థాయిని బట్టి చర్మం మరియు జుట్టు రంగులు ఏర్పడతాయి.కొన్ని సహజమైన చిట్కాలను పాటించడం వలన మీరు మళ్ళి నల్లని జుట్టుని పొందవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. ఒక గిన్నెలో నీటిని పోసి 2 స్పూన్ల టీ పొడి,అరస్పూన్ మెంతులను వేసి బాగా మరిగించి వడకట్టాలి.
ఒక బౌల్ లో 2 స్పూన్ల ఉసిరి పొడి తీసుకొని దానిలో మెంతుల టీ డికాషన్ కలిపి తలకు పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేయాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం పడుతుంది.
టీ డికాషన్, ఉసిరి,మెంతులు…ఇవన్నీ జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి. ఈ రెమిడీ తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా చుండ్రు,జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరగటానికి సహాయపడుతుంది. జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అవ్వండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.