Healthhealth tips in telugu

Eggs:గుడ్లు ఎంతకాలం నిల్వ ఉంటాయి.. పాడైనట్లు ఎలా తెలుస్తుంది?

Egg Quality : Egg లో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎగ్స్ సంవత్సరం పొడవునా విరివిగా లభ్యం అవుతాయి. గుడ్లు చాలా మందికి ఇష్టమైన ఆహారం. చాలా సులభంగా వండుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో, లంచ్‌లో లేదా డిన్నర్‌లో ఎప్పుడైనా తినొచ్చు. అయితే మనలో చాలా మందికి ఎగ్ తాజాగా ఉందో లేదో అనే సందేహం ఉంటుంది.

అలాగే Eggs ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి…అనే సందేహం కూడా ఉంటుంది. పండ్లు, కూరగాయలు వంటివి కుళ్లిపోతే మనం చాలా సులభంగానే గుర్తిస్తాము. అయితే Egg పాడైపోయినట్లు ఎలా తెలుస్తుంది? అసలు గుడ్లు ఎంతకాలం నిలువ ఉంటాయి? ఎన్ని రోజులు దాటితే వాటిని తినకూడదు? వంటి విషయాల గురించి మనలో చాలా మందికి అవగాహన లేదు.

కిరాణా షాపుల్లో లభించే గుడ్లు తాజావా…ఎన్ని రోజులు వాడవచ్చు అనే సమాచారం ఉండదు. గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు 15-20 రోజులు నిల్వ చేసుకొని తినవచ్చు. అయితే గది ఉష్ణోగ్రతలో 7-10 రోజులకు మించి నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. అయితే గుడ్లు పాడయినట్లు ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

ఒక గిన్నెలో నీటిని పోసి దానిలో Egg వేయాలి. Egg అడుగుకు చేరితే తాజాగా ఉన్నాయని అర్ధం. అదే గుడ్లు నీటి పైకి తేలితే Eggs పాడయ్యాయని అర్ధం. ఇలా పైకి తేలిన గుడ్లను కూడా బాగా ఉడికించినపుడు వాటి పొర లోపలి పదార్థం బయటకు వచ్చేస్తుంది.

అలా ఉన్నప్పుడు కూడా తినకూడదు. అయితే గుడ్లు రంగు మారినా లేదా పగుళ్లు ఏర్పడినా లేదా అసాధారణ వాసన వస్తున్నా కుళ్లిపోయాని అర్థం. వాటిని అస్సలు తినకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.