Beauty Tips

Hair Care Tips:గుప్పెడు కుంకుడుకాయలతో ఇలా చేస్తే.. జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Home made shampoo in telugu : మనం సాధారణంగా తలస్నానం చేయటానికి షాంపూ వాడుతూ ఉంటాం. ఒకప్పుడు కుంకుడుకాయలను వాడేవాళ్ళం. అయితే ఇప్పటి తరానికి అయితే కుంకుడుకాయల గురించి పెద్దగా తెలియదు. అందరూ షాంపూల మీద ఆధారపడుతున్నారు. అయితే షాంపూలు వాడటం వలన వాటిలో ఉండే కెమికల్స్ .జుట్టు రాలే సమస్యను ఎక్కువ చేస్తాయి.

అలా కాకుండా మనం ఇంటిలో సహజ సిద్ధంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా షాంపూ తయారు చేసుకుని వాడితే జుట్టు రాలే సమస్యతో పాటు జుట్టుకి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. ఒక గిన్నె లో జుట్టుకు సరిపడినంత కుంకుడుకాయలను తీసుకోవాలి. ఆ తర్వాత కుంకుడుకాయలో సగం మోతాదులో శీకాయ తీసుకోవాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల ఉసిరి ఎండు ముక్కలు తీసుకోవాలి.

ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కలోంజి విత్తనాలు తీసుకోవాలి. ఆ తర్వాత నాలుగు మందార ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇప్పుడు దీనిలో రెండు గ్లాసుల నీటిని పోయాలి. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి 20 నుంచి 25 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి… ఈ మిశ్రమంలో పిప్పిని తీసేసి రసంను తీసుకోవాలి.

ఈ రసంతో తల స్నానం చేస్తే జుట్టుకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. ముఖ్యంగా జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంకుడుకాయల్లో విటమిన్స్ ఉండటం వలన జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. .శీకాయలో ప్రోటీన్స్, అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉండుట వలన జుట్టుకి పోషణను అందించి మృదువుగా ఉండేలా చేస్తుంది.

ఉసిరి ముక్కలలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ గా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు పొడవుగా పెరగడానికి సహాయ పడుతుంది. ఇక మెంతులు., కలోంజీ విత్తనాలు ఈ రెండింటిలోనూ ఉన్న లక్షణాలు, పోషకాలు జుట్టు రాలకుండా బలంగా ఉండేలా చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.