Beauty Tips

Yellow To White Teeth :ఒకే ఒక్క నిమిషం ఉప్పుతో ఇలా చేస్తే పంటి మీద గార మాయం

Home remedies for white teeth and bad breath : పళ్ళు తెల్లగా అందంగా మెరుస్తూ ఉంటేనే బాగుంటుంది. చాలా.మంది పళ్ళు గార పట్టి పసుపు రంగులో మారి ఉంటాయి. అంతేకాకుండా మరికొంతమందికి చిగుళ్ల వాపు వస్తుంది. అలాగే నోటి దుర్వాసన కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. .

మన ఇంటిలో సహజసిద్ధంగా ఉండే వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ రెమిడీ కోసం ఆవనూనె,ఉప్పు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఇవి క్లెన్సర్‌గా పనిచేస్తాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన, పసుపు రంగు, దంత క్షయం, రక్తస్రావం మరియు చిగుళ్ళ వాపు వంటి తీవ్రమైన సమస్యలను కూడా తగ్గిస్తుంది.

ఆవనూనె మరియు ఉప్పు అనేది చిగుళ్ళను శుభ్రం చేయడానికి మరియు దంతాల నుండి ఫలకాన్ని తొలగించడానికి పురాతన కాలం నుండి వాడుతున్న పద్దతి. ఉప్పు తేలికపాటి రాపిడిని కలిగించి పళ్ళు తెల్లగా మెరవటానికి సహాయపడుతుంది. ఉప్పులో ఉండే ఫ్లోరైడ్ దంతాలు మరియు చిగుళ్ళను బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఆవనూనె చిగుళ్లను బలోపేతం చేసి పళ్ల మీద పసుపు రంగును తొలగించటానికి సహాయపడుతుంది. అరస్పూన్ ఆవనూనెలో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చూపుడు వేలు సాయంతో చిగుళ్ళు మరియు దంతాల మీద రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే క్రమంగా గార పట్టిన,పసుపు రంగులోకి మారిన పళ్ళు తెల్లగా మారతాయి.

గార పట్టిన,పసుపు రంగులోకి మారిన పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త సమయాన్ని శ్రద్ద పెడితే సరిపోతుంది. ఇంటి చిట్కాలను పాటించి తెల్లని ముత్యాల్లాంటి పళ్లను సొంతం చేసుకొండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.