How to lighten dark elbows: మోచేతుల నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
How to lighten dark elbows: మనలో చాలా మంది మోచేతుల నలుపు సమస్యతో బాధపడుతూ ఉంటారు. చర్మం ఎంత తెల్లగా,అందంగా ఉన్న మోచేతుల వద్ద నల్లగా ,రఫ్ గా ఉండుట వలన చాలా ఇబ్బందిగా ఉంటుంది.
ఈ నలుపును పోగొట్టుకోవడానికి అనేక రకాల క్రీమ్స్ అనేక ప్రయత్నాలు చేసిన పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.
ముందుగా నిమ్మకాయను సగం కట్ చేయాలి. కట్ చేసిన నిమ్మ ముక్కను ఉప్పులో అద్ది.మోచేతులకు రెండు నిమిషాల పాలు రుద్దాలి. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా మోచేతుల నలుపు తగ్గిపోతుంది. కాస్త శ్రద్ద సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
శనగపిండిలో పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి.ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మంపై ఎక్స్‌ఫోలియేట్‌లా పనిచేస్తుంది.తద్వారా మోచేతుల నలుపు తగ్గడంతో పాటు.మృదువుగా కూడా మారుతుంది. శనగపిండిని చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.