Tomato Dosa:టమాటా దోశలను ఇలా ఎంతో సింపుల్‌గా వేసుకోవచ్చు తెలుసా.. రుచిగా ఉంటాయి..!
Tomato Dosa:టమాటో దోశ.. ఓట్స్ మరియు టమాటోలతో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తయారు చేసి చూడండి.ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో పిల్లలకు పెద్దలకు ఎంతో రుచిగా ఉంటుంది.
కావాల్సిన పదార్ధాలు
ఓట్స్ – 1 కప్పు
బియ్యం పిండి – 1 కప్పు
గోధుమ పిండి -1/2 కప్పు
అల్లం ముక్కలు – 2-3
ఎండుమిర్చి – 2-3
ఉప్పు – 1 టీ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవలి.
2.మిక్సింగ్ బౌల్ లోకి ఓట్స్ ని వేసి పౌడర్ చేసుకోవాలి.
3.ఒక మిక్సింగ్ బౌల్ లోకి బియ్యం పిండి,గోధుమ పిండి,తీసుకున్న పదార్ధాలను వేసి కలుపుకోవాలి.
4.మిక్సి జార్ లోకి టమాటో ముక్కలను వేసి చిన్న అల్లం ముక్కలు,ఎండుమిర్చి వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
5.ఈ మిశ్రమాన్ని పిండిలో కలుపుకోని కొద్దిగా నీళ్లను వేసి దోశ కన్ సిస్టెన్సీలో కలుపుకోవాలి.
6. అందులోకి ఉప్పు,వేసి పదినిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
7.ఇప్పుడు అందులోకి తరిగిన ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి.
8.స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టుకోని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి టమాటో బ్యాటర్ ని పెనం పై వేసుకోవాలి.గరిటతో స్ప్రెడ్ చేయకూడదు.
9.వేసుకున్న దోశ పై ఆయిల్ చల్లుకోని దోరగా కాల్చుకుంటే టమాటో దోశ రెడీ.