Ammoru Movie :అమ్మోరు మూవీ వెనుక శ్రమ,కష్టం ఎంతో తెలుసా…ఎన్ని కోట్ల లాభమో ?
Ammoru Movie :వినోదంతో పాటు ఆశ్చర్యం ముంచెత్తే సినిమాల్లో అమ్మోరు ఒకటి. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో నిర్మాత శ్యాం ప్రసాదరెడ్డి తీసిన అమ్మోరు మూవీ వెనుక చాలా కష్టం, శ్రమ దాగున్నాయట. సౌందర్య ఈమూవీతో నెంబర్ వన్ హీరోయిన్ అయింది. చిన్నపిల్లగా అమ్మవారుగా చేసిన బేబీ సునయనకు మంచి పేరువచ్చింది.
పూర్తిస్థాయి గ్రాఫిక్స్ తో వచ్చిన తొలి ఇండియన్ మూవీ గా నిల్చింది. 32సెంటర్స్ లో 100రోజులు ఆడింది. తమిళంలో డబ్బింగ్ చేస్తే కోటి రూపాయలు తెచ్చింది. హిందీ, మలయాళం, బెంగాలీ ఇలా అన్నింటా హిట్. ఆగ్రహం మూవీ అనుకున్న రిజల్ట్ తేకపోవడంతో నిరాశతో శ్యాం ప్రసాదరెడ్డి రెస్ట్ కోసం నెల్లాళ్ళు అమెరికా వెళ్లారు.
అక్కడ టెర్మినేటర్ 2మూవీ చూసి, ఇలాంటి గ్రాఫిక్స్ సినిమాలు తెలుగులో ఎందుకు రావడం లేదని అనుకుని, హాంగాకాంగ్,సింగపూర్, లండన్ లలో నిపుణుల దగ్గరకు వెళ్లి గ్రాఫిక్స్ గురించి అవగాహన పెంచుకున్నారు. ఈ సందర్బంగా లండన్ కి చెందిన క్రిస్ బాగా పరిచయం అవ్వడంతో పల్లెటూరి నేపథ్యంలో గ్రాఫిక్స్ తో మూవీ చేయవచ్చా అని అడగడం, ఆయన చేయొచ్చని అనడంతో ఇండియా వచ్చేసారు.
ఓ కథ రెడీ చేసి, ఎక్కడ గ్రాఫిక్స్ వాడాలో రాసుకుని మరీ ఏ. కోదండరామిరెడ్డి దగ్గర అసిస్టెంట్ గా చేసిన రామారావు అనే వ్యక్తిని డైరెక్టర్ గా పెట్టుకున్నారు. ఈలోగా బాబుమోహన్ అక్కడికి వచ్చి కథ విని బాగుందని చెప్పడమే కాకుండా హీరోయిన్ గా మనవరాలిపెళ్లి మూవీలో చేస్తున్న అమ్మాయిని పెట్టుకోవాలని అనడంతో శ్యాం ప్రసాదరెడ్డి షూటింగ్ స్పాట్ కి వెళ్లి , సౌందర్యను ఒకే చేశారు.
ఇక అమ్మోరి గెటప్ కోసం రమ్యకృష్ణను సెలక్ట్ చేయడంతో ఇండస్ట్రీ షాకయింది. చిన్నా , సురేష్ తదితర తారాగణంతో మూవీ షూటింగ్ స్టార్ట్. తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లిలో 80శాతం షూటింగ్ పూర్తిచేశారు. మొత్తం షూటింగ్ అయ్యాక గ్రాఫిక్స్ కోసం లండన్ వెళ్లారు. కానీ అవుట్ ఫుట్ అసలు బాగారాలేదు.
దాంతో ఇండియా వచ్చేసి, సినిమా రీళ్లు పక్కన పడేసి, మళ్ళీ మొదటి నుంచి తీయడానికి సిద్ధపడ్డంతో అందరూ షాకయ్యారు. ఈసారి కోడి రామకృష్ణను డైరెక్టర్ గా సెలక్ట్ చేసారు. చిన్నా ప్లేస్ లో రామిరెడ్డి విలన్ గా వచ్చాడు. ఒక్కో షాట్ వారం పట్టేది. నీళ్లలోంచి చేయి పైకి వచ్చే షాట్ 18రోజులు పట్టింది.
కేవలం 10సెకన్లు కనిపించే షాట్ ఇది. 70రోజుల్లో సినిమా పూర్తయ్యాక, క్రిస్ ఇండియా వచ్చి ఏడాదిపాటు ఇక్కడే ఉండి, గ్రాఫిక్స్ చేసాడు. ఇక చక్రవర్తికి ఆరోగ్యం బాగోకపోవడం ఆయన కొడుకు శ్రీ మ్యూజిక్ చేయడం ఇలా చాలా కష్టనష్టాలు చవిచూశారు. కోటి 80లక్షల బడ్జెట్. ఇందులో రెండొంతులు గ్రాఫిక్స్ కి అయింది. మూడేళ్లు కష్టం. ఈలోగా సౌందర్య పాతిక సినిమాలు చేసేసింది. అప్పటి రెమ్యునరేషన్ రేంజ్ కి 5శాతం కూడా దక్కలేదు.
అయినా సౌందర్య ఏమీ అనలేదు. బయ్యర్లు రాకపోవడంతో 1995 నవంబర్ 23న సొంతంగా శ్యాం ప్రసాద్ రెడ్డి రిలీజ్ చేసారు. రెండు వారల వరకూ టాక్ రాలేదు. తర్వాత బ్లాక్ బస్టర్. గ్రాఫిక్స్,యాక్టింగ్ జనాలకు పూనకాలు రప్పించాయి. నిజంగా పూనకాలు వచ్చినవాళ్ళను చల్లడానికి పసుపు నీళ్లు, వేపాకులు థియేటర్ దగ్గర రెడీ చేసారంటే ఈ సినిమా రేంజ్ చెప్పక్కర్లేదు.
థియేటర్ల దగ్గర చిన్న గుడులు కూడా వెలసి,పూజలు చేసేవారు. అమ్మవారి రూపంలో రమ్యకృష్ణ అదిరిపోయింది. 10కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. బిబిసి తమ ఛానల్ కోసం ఈ మూవీ హక్కులు దక్కించుకోవడం మరీ విశేషం.