Tollywood:Director రాఘవేంద్రరావు పండు పడిన తొలి హీరోయిన్ ఎవరో తెలుసా ?
Director raghavendra rao : Director raghavendra rao అంటే టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయన సినిమాల్లో హీరోయిన్ లను గ్లామర్ గా చూపిస్తారు. తండ్రి కే.యస్. ప్రకాష్ వద్ద ఓనమాలు నేర్చుకున్న కే.రాఘవేంద్రరావు దర్శకుడిగా మారి, వందకు పైనే సినిమాలు తీసిన రాఘవేంద్రరావు దర్శకునిగా 45 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాడు.
రాఘవేంద్రరావు శోభన్ బాబు హీరోగా ‘బాబు’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అంతేకాదు 100 పైగా చిత్రాలను డైరెక్ట్ చేసిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఒక్కో డైరెక్టర్ కి ఒక్కొక్క స్పెషాల్టీ ఉంటుంది. ఇక తెలుగు చిత్ర సీమలో ఓ హీరోయిన్ ను తెరపై ఎంత అందంగా చూపించాలో…ఏ ఏ యాంగిల్స్ లో చూపించాలో కు తెలిసినంతగా తెలిసిన దర్శకుడు ఎవరనగానే దర్శకేంద్రుడి పేరే చెబుతాం.
ఆయన కెమెరాకు ప్రతి భామ ఒక ముద్దబంతి పువ్వే. పదహారేళ్ల వయసు కన్నెపిల్ల భావాలను సిరిమల్లె పువ్వల్లే చాలా చక్కగా ఆవిష్కరించి తనలోని మార్క్ చూపించాడు. కథానాయికను శృంగార దేవతగా చూపించడంలో సక్సెస్ సాధించాడు. రాఘవేంద్రరావు రూపొందించే మూవీల్లో కథ, కథనంతో పాటు మ్యూజిక్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటు పాటల చిత్రీకరణలో.. హీరోయిన్ ను గ్లామర్ గా చూపించడంలో విభిన్న శైలి కనబరుస్తారు.
అందుకనే ఆయన మూవీని కేవలం పాటల కోసం మాత్రమే చూసే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు. ముఖ్యంగా హీరోయిన్స్ నాభిపై ఆయన వేసే పూలు, పండ్ల కోసం రిపీట్ ఆడియన్స్ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ఇక ఈయన మొదటిసారి పండు వేసిన హీరోయిన్ ఎవరో ఒకసారి పరిశీలిస్తే…నిజానికి రాఘవేంద్రరావు అంతకు ముందు పూలు, పండ్లు వినియోగించినా.. హీరోయిన్స్ పై పండ్లు వేయడం చిరంజీవి, విజయశాంతి, సుహాసిని హీరో, హీరోయిన్లుగా తెరకెక్కించిన ‘మంచి దొంగ’ సినిమాతో స్టార్ట్ అయింది.
ఈ సినిమాలో ‘బెడ్ లైట్ తగ్గించనా’ అనే పాటలో తొలిసారి విజయశాంతి పై పండ్లు వేసారు. ఫస్ట్ నైట్‌కు సంబంధించిన పాట కాబట్టి వెరైటీగా ఉండాలని ఈ పాటను కాస్త కొత్తగా ప్లాన్ చేసారు. ఈ పాటకు చక్రవర్తి అద్భుతమైన బాణీలు సమకూర్చారు. చిరు, విజయశాంతిపై ఫస్ట్ నైట్ సన్నివేశం కాబట్టి లైట్లు ఆన్ చేసినపుడు ఓ బీట్.. ఆఫ్ చేసినపుడు మరో బీట్ వచ్చేలా చక్రవర్తి ఈ పాటకు ట్యూన్ అందించారు. అలా ‘మంచి దొంగ’ సినిమాలో విజయశాంతిపై తొలి పండు పడిందన్నమాట. ఇక అక్కడ నుంచి అందరి హీరోయిన్స్ మీద ప్రయోగించారు.