Kitchenvantalu

Chidambaram Temple Prasadam:చిదంబర ఆలయం ప్రత్యేక ప్రసాదం.. రుచి చూస్తే అసలు వదిలిపెట్టరు

Chidambaram Temple Prasadam: పండగలకి మనం ఎలాగైతే వెరైటీ వంటలు,స్పెషల్స్ చేసుకుంటామో..పూజలకి,వ్రతాలకి,శుభకార్యాలకి దేవుడికి స్పెషల్ నైవేద్యాలు పెట్టాలి అనుకుంటుంటాం. కందిపప్పు,పెసరపప్పు,బియ్యం తో కలిపి కమ్మని తమిళనాడు స్పెషల్ ప్రసాదం తిరువదిరాయ్ కలి చేసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 1 కప్పు
పెసరపప్పు – ¼ కప్పు
కందిపప్పు – ¼ కప్పు
కొబ్బరి తురుము – 1 కప్పు
బెల్లం – 3 కప్పులు
నెయ్యి – 1 కప్పు
యాలకుల పొడి – ½ టీ స్పూన్
జాజికాయ పొడి – 2 చిటికెల్లు
జీడిపప్పు – 15
నీళ్లు – 5 కప్పులు

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని కందిపప్పు,పెసరపప్పు ని దోరగా వేయించి పెట్టుకోవాలి.
2.వేపుకున్న పప్పులు,బియ్యం కలిపి మిక్సీ జార్ లో వేసి రవ్వ రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి.
3.కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కరిగించి అందులో రవ్వను వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు కలుపుతూ వేపుకోవాలి.
4.రవ్వ రంగు మారాకా పావు కప్పు పచ్చికొబ్బరి తురుము వేసి మరో నిమిషం వేపి మూడు కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ పై మెత్తగా ఉడకనివ్వాలి.

5.బెల్లం లో రెండు కప్పుల నీళ్లు పోసి లేత పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి.
6.మరుగుతున్న లేత పాకంలో మెత్తగా ఉడికించిన పప్పు అన్నం వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
7.పాకంలో అన్నం కలిసిపోయాక మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ,జాజికాయ పొడి ,యాలకుల పొడి వేసి మరో మూడు ,నాలుగు నిమిషాలు అడుగంటకుండా కలుపుత ఉడకనివ్వాలి.
8.ఇప్పుడు కలి లోంచి నెయ్యి పైకి తేలుతున్న సమయంలో మిగిలిన కొబ్బరి తురుము,అంతా వేసి రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
9.ఇప్పుడు మిగిలిన నెయ్యిలో జీడిపప్పు,కిస్మిస్ వేసి పొంగాక కలి ప్రసాదంలో కలిపేసుకుంటే ప్రసాదం రెడీ అయినట్టే.
Click Here To Follow Chaipakodi On Google News