Dandruff Treatment: డాండ్రఫ్ సమస్యతో విసిగిపోతున్నారా.. ఈ చిట్కాలు ట్రై చేయండి
Chundru Home remedies In telugu : తలలో చుండ్రు వచ్చిందంటే తొందరగా తగ్గదు. చుండ్రు వచ్చిందంటే.దురద, ఇరిటేషన్, మొటిమలు, జుట్టు పొడిగా మారటం, జుట్టు రాలిపోవటం వంటి ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్యల నుండి బయట పడటానికి ఖరీదైన షాంపూలు,నూనెలు వాడుతూ ఉంటారు.
అయితే అవి పెద్దగా ప్రభావాన్ని చూపవు. దాంతో కాస్త ఆందోళన చెందుతారు. అలా కాకుండా ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే చాలా సులభంగా చుండ్రు సమస్య నుండి బయట పడవచ్చు. గుప్పెడు పుదీనా ఆకులు,గుప్పెడు వేప ఆకులు,గుప్పెడు కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.
ఈ పేస్ట్ నుంచి రసాన్ని వడకట్టాలి. ఈ రసాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ ఆముదం,ఒక స్పూన్ కొబ్బరి నూనె, రెండు స్పూన్ల ఆలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు.
పుదీనాలో ఉండే యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుం తల మీద దురద లేకుండా చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మెంథాల్ గుణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా సాగేలా చేస్తుంది. దాంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. వేప ఆకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
కరివేపాకులో బీటా కెరోటిన్ (Beta carotene) అనే ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), విటమిన్ ఇ, ఎ, సి లు జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలను అందించి జుట్టు ఒత్తుగా బలంగా పెరిగేందుకు సహాయపడతాయి. ఇవి తలలో రక్తప్రసరణ (Blood circulation) మెరుగుదలకు సహాయపడి జుట్టు పెరగడాన్ని బలోపేతం చేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.