Black Sesame Seeds benefits: నల్ల నువ్వులు రోజూ తింటే.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు!
Black sesame Seeds Benefits In telugu : నల్ల నువ్వులలో ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో అంటే చలికాలంలో నువ్వులను తీసుకుంటే శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. నువ్వులను వేగించి లేదా బెల్లం కలిపి… లేదంటే సూప్‌లు, సలాడ్‌లలో వేసుకొని తినవచ్చు.
నువ్వులలో జింక్, సెలీనియం, కాపర్, ఐరన్, విటమిన్ బి6, విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అంతేకాక చలికాలంలో నొప్పులు, వాపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
నువ్వులలో సెసామోల్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది.
ఇది ప్రో-ఇన్‌ఫ్లమేటరీ రసాయనాల ఉత్పత్తిని నిరోధించడం ద్వారా వాపును నివారించడంలో సహాయపడుతుంది. నువ్వులలో పీచు సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు లేకుండా ముఖ్యంగా మలబద్దకం సమస్య ఉన్నవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
నువ్వులలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. మంచి మొత్తంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పినోరెసినాల్ ఉంటాయి. ఇది జీర్ణ ఎంజైమ్ మాల్టేస్ చర్యను నిరోధించడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. నువ్వులు ఆందోళనను తగ్గించడానికి సహాయపడతాయి. నువ్వులలో ఆందోళన-తగ్గించే ప్రభావం మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఒత్తిడి లేకుండా చేస్తాయి.
చలికాలంలో వచ్చే దగ్గు,జలుబు, గొంతునొప్పి వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. నువ్వులలో నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు అనే రెండు రకాలు లభ్యం అవుతాయి. ఈ చలికాలంలో ఏ నువ్వులను తీసుకున్న మంచి ప్రయోజనం పొందవచ్చు. రోజులో ఒక స్పూన్ మోతాదులో నువ్వులను తీసుకోవాలి. నువ్వులను నీటిలో నానబెట్టి రెండు గంటలు అయ్యాక నానిన నువ్వులను తింటూ ఆ నీటిని తాగవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.