Healthhealth tips in telugu

iron rich foods:రక్త హీనతతో బాధపడుతున్నారా.. అయితే హిమోగ్లోబిన్ పెంచే ఆహారం ఇదే..!

iron rich foods Thotakura : చలికాలంలో ఆకుకూరలు చాలా విరివిగానే లభిస్తాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలను అందిస్తాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారు తోటకూర తింటే ఐరన్ సమృద్దిగా లభించి రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. తోటకూర మనకు విరివిగానే లభ్యం అవుతుంది.

తోటకూరతో పప్పు,కూర,పులుసు వంటివి చేసుకొని వారంలో మూడు సార్లు తీసుకోవాలి. రక్తహీనత సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు. ఎందుకంటే రక్తహీనత కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఆహారంలో మార్పులు చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి.

ఐరన్ అనేది ఎర్రరక్తకణాల ఉత్పత్తికి మరియు సెల్యులార్ జీవక్రియకు సహాయపడుతుంది. తోటకూర కూర లేదా జ్యూస్ చేసినప్పుడు నిమ్మరసం పిండి తీసుకుంటే నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరం ఐరన్ శోషించటానికి సహాయపడుతుంది. విటమిన్ a సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది.

తోటకూరను తినటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి కాల్షియం లోపం లేకుండా ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తోటకూరను వారంలో రెండు సార్లు తీసుకుంటే మంచిది. చాలా తక్కువ ఖర్చులో ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి.

తోటకూరలో విటమిన్‌ A, C, D, E, K, విటమిన్‌ B12, B6, కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. తోటకూర ఆకుల్ని మెత్తగా రుబ్బి తలకు పట్టిస్తే జుట్టు రాలదు. చుండ్రు తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.