Beauty Tips

Skin Care Tips:ఈ ఆకులతో చేసిన నూనెను వాడితే ముడతలు,పిగ్మెంటేషన్ అన్నీ మాయం అవుతాయి

Skin whitening Oil : వయస్సు పెరిగే కొద్ది ముఖం మీద ముడతలు,పిగ్మెంటేషన్, చర్మ ఛాయ తగ్గటం వంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి మన ఇంటిలో ఒక నూనెను తయారుచేసుకోవచ్చు. ఈ నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు.

మనకు ఇంటిలో సులభంగా దొరికే కొన్ని సహజసిద్దమైన వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా నూనెను తయారుచేయవచ్చు. దీని కోసం ముందుగా మిక్సీ జార్ లో గుప్పెడు ఎరుపు రంగు గులాబీ రేకలు, పది పుదీనా ఆకులు, రెండు రెబ్బల కరివేపాకు,పది తులసి ఆకులు,ఒక నిమ్మకాయ తొక్కలు వేసి మిక్సీ చేయాలి.

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక కప్పు కొబ్బరి నూనె పోసి కాస్త వేడి అయ్యాక మిక్సీ చేసిన మిశ్రమం వేసి 10 నుంచి 12 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత పావు స్పూన్ పసుపు, అరస్పూన్ అతిమధురం పొడి వేసి మరో 5 నిమిషాలు మరిగించి పొయ్యి ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం చల్లారాక పల్చని వస్త్రం సాయంతో వడకట్టి నిల్వ చేసుకోవాలి.
Pudina Health benefits in telugu
ఈ నూనె దాదాపుగా పది రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకొని టవల్ తో తుడుచుకొని ఈ నూనెను ముఖానికి రాసి 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఉదయం చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే ముఖం మీద ముడతలు,పిగ్మెంటేషన్ వంటివి క్రమంగా తగ్గుతాయి.

ఏ చర్మ సమస్యకు అయినా మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలు సరిపోతాయి. కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. చాలా తక్కువ ఖర్చుతో పిగ్మెంటేషన్, ముడతలను తగ్గించుకోవచ్చు. ఖరీదైన కాస్మోటిక్స్ వాడవలసిన అవసరం లేదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.