MoviesTollywood news in telugu

Nagarjuna:నువ్వు వస్తావని సినిమా వెనక ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు

Nagarjuna Nuvvu Vastavani Movie : అన్నమయ్య సూపర్ హిట్ మూవీ తర్వాత కొన్ని డిజాస్టర్స్, ఏవరేజ్ మూవీస్ తర్వాత కింగ్ నాగార్జున నటించిన నువ్వు వస్తావని మూవీ టాలీవుడ్ ని షేక్ చేసింది. ఈ మూవీ అప్పట్లో ఫాన్స్ లో ఫుల్ జోష్ నింపి, 40కేంద్రాల్లో ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేసిన లవ్ స్టోరీ మూవీ ఇది. ఎన్నాళ్ళనుంచో కలగా మిగిలిన కోరిక తీరింది.

సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్బీ చౌదరికి బ్రాండ్ వేల్యూ మరింత పెంచిన సినిమా ఇది. డైరెక్టర్ వి ఆర్ ప్రతాప్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టి వార్తలకెక్కించింది. 15కోట్ల వరకూ షేర్ కలెక్ట్ చేసి,ఆల్ టైం టాప్ టు మూవీగా నిల్చింది. ఈసినిమా విశేషాల్లోకి వెళ్తే,.. ఆవిడ మా ఆవిడే ,సీతారామరాజు లాంటి కమర్షియల్స్ పడినప్పటికీ సరైన సూపర్ హిట్ మూవీ లేకపోవడంతో ఫాన్స్ లో బాధ ఉండేది.

మిగిలిన హీరోలు దూసుకుపోతుంటే నాగ్ కెరీర్ డౌన్ లోకి వచ్చేసిన సందర్భంలో 1999 లో రావోయి చందమామ షూటింగ్ జరుగుతోంది. ఇక ప్రొడ్యూసర్ అశ్వినీదత్ మరో మూవీ చేయాల్సిన సమయం. ఇక గణేష్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన తిరుపతి స్వామికి నాగ్ కూడా కమిట్ మెంట్ ఇచ్చేసాడు. అయితే వరుస ప్లాప్స్ టైం లో ఫ్యామిలీ మూవీ చేసాక ఈ మూవీ చేయాలనీ అశ్వినిదత్ కి చెప్పేసి, నిర్మాత ఆర్ బి చౌదరికి నాగ్ కబురు పంపాడు.

అయితే అప్పటికే ఓ తమిళ మూవీ రైట్స్ తీసుకున్న చౌదరి విషయం చెప్పి,ఓసారి సినిమా చూడమని సిడి ఇచ్చి వెళ్ళిపోయాడు. విజయ్ ,సిమ్రాన్ జంటగా నటించిన ఆ మూవీ తమిళంలో సూపర్ హిట్ అవ్వడంతో నాగ్ కొత్తదనం కోరుతూ ఒకే చెప్పేసాడు. ప్రముఖ రచయిత మరుదూరి రాజా అందంగా తెలుగులో తర్జుమా చేసాడు. ఇక భీమినేని శ్రీనివాసరావు,ముప్పలనేని శివ వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేయాలనీ చౌదరి భావించాడు.

అయితే అప్పటికే మాటిచ్చిన వి ఆర్ ప్రతాప్ అనే కుర్రాడికి ఛాన్స్ ఇవ్వడంతో సిమ్రాన్ ని హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. ఎస్ ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ తీసుకున్నాడు. ఇక రావోయి చందమామ ప్లాప్ అవ్వడంతో తక్కువ బడ్జెట్ లోనే సినిమా చేయమని చౌదరికి నాగ్ చెప్పేసాడు. 1999నవంబర్ లో షూటింగ్ ప్రారంభమై, కులుమనాలి కేరళ,రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియో లలో షూటింగ్ చేసారు. నాగ్ రెమ్యునరేషన్ పక్కన పెడితే రెండుకోట్ల లోపే బడ్జెట్ అయింది.

2000 మార్చిలో ఆడియో వచ్చి సూపర్ హిట్ అయింది. దీంతో నైజాంలో 4కోట్ల 25లక్షలకు అమ్ముడవ్వడం రికార్డ్. ఏప్రియల్ 5న రిలీజ్ అయింది. స్టార్టింగ్ షో ఇంటర్వెల్ అయ్యాక బొమ్మ బ్లాక్ బస్టర్ అని తేలిపోయింది. ఎమోషన్స్,సెంటిమెంట్స్,యాక్టింగ్, కామెడీ అన్నీ సూపర్. అన్ని షోస్ కి టికెట్స్ అయ్యాయి. వారం దాకా నాగ్ ఫాన్స్ తో నిండిపోయింది. నైజాం లో 5కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ సమరసింహారెడ్డి తరవాత రికార్డ్స్ క్రియేట్ చేసింది.