Kitchenvantalu

Banana Lassi:కేవలం 2 నిమిషాల్లో నీరసాన్ని తగ్గించి ఎనర్జీని ఇచ్చే బనానా లస్సీ

Banana Lassi:బనానా లస్సీ..మనలో చాలా మంది చల్లదనం కోసం కూల్ డ్రింక్స్ కోసం,చల్లటి పదార్ధాలకోసం వెతుకుతు ఉంటాం. దాహం తీర్చుకోడానికి బనానా పెరుగుతో లస్సీ తయారు చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
పెరుగు – 1 కప్పు
చక్కెర – 3-4 టేబుల్ స్పూన్స్
అరటి పండు – 1
ఐస్ క్యూబ్స్ – తగినన్ని
పాలు – ½ కప్పు

తయారీ విధానం
1.ముందుగా బ్లెండర్ లోకి కప్పు పెరుగు వేసి,అందులోకి అరటి పండును ముక్కలుగా చేసి వేసుకోవాలి.
2.అందులోకి చక్కెర,ఐస్ క్యూబ్స్, కాచి చల్లార్చిన పాలును యాడ్ చేసుకోవాలి.
3.లంప్స్ లేకుండా మెత్తని ప్యూరీలా బ్లెండ్ చేసుకోవాలి.
3.సర్వింగ్ గ్లాస్ లోకి లస్సీనీ నింపుకోని అవసరం అనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవడమే.