Face Glow Tips:1 స్పూన్ పొడి మొటిమలు,ముడతలు,బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ అన్నింటిని మాయం చేస్తుంది
Black salt Face Benefits : మనం ప్రతి రోజు వంటల్లో తెల్ల ఉప్పు వాడుతూ ఉంటాం. కొంతమంది నల్ల ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు. తెల్ల ఉప్పుతో పోలిస్తే నల్ల ఉప్పులో పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే. అయితే నల్ల ఉప్పును ఉపయోగించి ముఖం మీద ముడతలు,మొటిమలు వంటి అన్నీ రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.
నల్ల ఉప్పు ముఖం మీద ఉన్న దుమ్ము,ధూళి,అదనంగా ఉన్న నూనెను తొలగించటమే కాకుండా చర్మానికి అద్భుతమైన క్లెన్సర్‌గా పని చేస్తుంది. ఇది రంధ్రాలను అన్‌లాగ్ చేయడానికి మరియు లోతైన మురికిని తొలగించడానికి చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. రక్త ప్రసరణను ప్రోత్సహించి తద్వారా ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది.
ఒక బౌల్ లో ఒక స్పూన్ నల్ల ఉప్పు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్,ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిపి ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితం వస్తుంది.
ముఖం మీద ఉన్న మొటిమలు,ముడతలు,బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ వంటివి అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. అంతే కాకుండా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నల్ల ఉప్పు ఆయుర్వేదం షాప్ లలోనూ,Online stores లోనూ లభ్యం అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.