Hair Care Tips:బంగాళాదుంపతో ఇలా చేస్తే ఎంత పలుచగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది
Fast hair growth secrets in Telugu : ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అంతే కాకుండా జుట్టు రాలిపోతోందని, పలుచగా ఉందని, జుట్టు పెరగటం లేదని, రఫ్ గా ఉందని బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు.
మన ఇంట్లో దొరికే కేవలం రెండు ఇంగ్రిడియంట్స్ తో సులభంగా తగ్గించుకోవచ్చు.ఈ రెమిడీ కోసం ఒక బంగాళదుంప తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీయకుండా తురమాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి బంగాళదుంప తురుము వేసి బాగా ఉడికించాలి. ఉడికిన బంగాళదుంప తురుమును మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
ఈ పేస్టు లో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ లోని ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టేలా పట్టించాలి. రెండు గంటల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి .జుట్టు సిల్కీ గా మారుతుంది. అలాగే జుట్టు చిక్కు పడటం కూడా తగ్గుతుంది.
ఈ ప్యాక్ వేసుకోవటం వలన జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలు తగ్గుతాయి. బంగాళాదుంపలో ఉండే సమ్మేళనాలు జుట్టు తంతువులకు పోషణ అందించి జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. బంగాళదుంపలలో విటమిన్లు బి, సి, ఐరన్ మరియు జింక్ అధికంగా ఉండుట వలన జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి జుట్టు పెరిగేలా చేస్తుంది.
విటమిన్ E Oil జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన స్కాల్ప్ ఆరోగ్యాన్ని పెంచుతుంది, జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అలాగే జుట్టు బలంగా,కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. జుట్టు కుదుళ్లకు బలాన్ని అందిస్తుంది. స్కాల్ప్‌కు రక్త ప్రసరణను పెంచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.