Healthhealth tips in telugu

Talambralu chettu :ఈ చెట్టును అందరూ చూసే ఉంటారు.. కానీ ఈ చెట్టులో ఉన్నఆ రహస్యం గురించి..

Talambralu chettu Benefits in Telugu : మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తున్నా..వాటి గురించి తెలియక పిచ్చి ముక్కలుగా భావిస్తాం. వాటిలో కూడా ఎన్నో ప్రయోజనాలు దాగి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు రోడ్డు పక్కన పొలాల గట్ల మీద ఎక్కడపడితే అక్కడ కనిపించే తలంబ్రాల మొక్క గురించి తెలుసుకోండి
Talambralu Chettu Benefits in telugu
ఈ మొక్కను మనం ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం. గ్రామాలలో ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంటుంది. చెరువు కట్టలు, పిల్ల కాలువల పక్క గానీ ఆ కాలువలో ఇరువైపులా మొక్కలు అధికంగా కనిపిస్తుంటాయి. అయితే ఈ మొక్క గురించి మనకు పెద్దగా ఏమీ తెలీదు. గ్రామాల్లో ఉండేవారికి ఈ మొక్క గురించి బాగా తెలుసు. వాళ్ళు ఈ మొక్కను ఎదో రకంగా రోజు వాడుతూనే ఉంటారు. ఈరోజు ఈ మొక్క గురించి వివరంగా తెలుసుకుందాం.

వెర్బినేసి కుటుంబానికి చెందిన తలంబ్రాల చెట్టు ఒక పొద. దీనిలో దాదాపుగా 150 జాతులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో, ఈ చెట్టుని లంబాడీ చెట్టు, గాజుకంప అని కూడా అంటారు. చర్మ సమస్యలను తగ్గించటంలో చాల ప్రభావవంతంగా పనిచేస్తుంది. గజ్జి,తామర వంటి చర్మ సమస్యల చికిత్సలో ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.
Joint Pains
దీనిలో క్రిమినాశక మరియు యాంటీమైక్రోబయాల్ లక్షణాల వల్ల గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. పొలాల్లో పనులు చేసినప్పుడు గాయాలు అయితే ఈ ఆకులను నలిపి కట్టు కడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఒకప్పుడు 6o ఏళ్ళు వచ్చాక మోకాళ్ళ నొప్పులు వచ్చేయి.
Talambralu Chettu Benefits in telugu
ఇప్పుడు చిన్న వయసులో రావడానికి మారిపోయిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, అధిక బరువు వంటి సమస్యల కారణంగా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి.మోకాళ్ళ నొప్పులు రాగానే చాలామంది పెయిన్ కిల్లర్ వాడుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వవచ్చు. .

ఈ ఆకులను ఆముదంతో కలిపి మెత్తని పేస్ట్ గా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో పైపూతగా రాసి ఒక క్లాత్ తో గట్టిగా కట్టాలి. ఇలా రాత్రి పడుకోవడానికి ముందు చేయాలి ఈ విధంగా నెలరోజులపాటు చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు వెన్నునొప్పి, రుమాటిజం మరియు కండరాల నొప్పులు ఇలా అన్ని రకాల నుండి ఉపశమనం కలుగుతుంది.

దగ్గు గొంతు నొప్పి తగ్గటానికి సహాయపడుతుంది. ఈ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి,దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. పురుగుల కుట్టడం మరియు కాటు నొప్పిని తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ శరీరానికి చాలా హానికరం. అందువల్ల, ఫ్రీ రాడికల్స్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం.
gas troble home remedies
ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ ని తరిమి కొడుతోంది. శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ సమ్మేళనాలను కలిగి ఉండుట వలన కడుపులో హానికరమైన బ్యాక్టీరియాను తొలగించటానికి సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది.

దోమలను తరిమికొట్టడానికి చాలా అద్భుతంగ పనిచేస్తుంది. ఈ ఆకుల్లో మిథనాలిక్ మరియు ఇథనాలిక్ సమ్మేళనాలు కలిగి ఉండుట వలన దోమలు కీటకాలను తరిమి కొట్టటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీని కోసం తలంబ్రాల చెట్టు ఆకులను ఎండబెట్టి పొగ వేయాలి. ఆ పొగకు దోమలు పోతాయి. ఇటువంటి చెట్టులను ఆరోగ్యపరంగా ఉపయోగించినప్పుడు ఒక్కసారి ఆయుర్వేద నిపుణున్ని సంప్రదిస్తే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.